Share News

AP News: వెలుగులోకి జగన్ సర్కార్ అక్రమాలు

ABN , Publish Date - May 26 , 2024 | 02:23 AM

జగన్‌ సర్కారు ఆర్థిక అవకతవకలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి.

 AP News: వెలుగులోకి జగన్ సర్కార్ అక్రమాలు
andhra pradesh government

తవ్వేకొద్దీ తప్పులకుప్పలు

ఏ బ్యాంక్‌లో అయినా డబ్బు డిపాజిట్‌ చేస్తే మెచ్యూర్‌ అయిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. అలా చెల్లించకపోతే నేరమే. జగన్‌ సర్కారు సరిగ్గా ఇలాంటి ఆర్థిక నేరాలే చేసింది. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ పేరిట సాగించిన దోపిడీ తాజాగా వెలుగు చూసింది. ఇక్కడ బాధితులు ప్రభుత్వ రంగ సంస్థలు/శాఖలు కావడం విశేషం.

జగన్‌ సర్కారు అడ్డగోలు అక్రమాలు

4,736 కోట్ల ‘డిపాజిట్ల’ గోల్‌మాల్‌

33 కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల

నుంచి తీసుకుని మొండిచేయి

ఏపీఎ్‌సఎ్‌ఫసీ పేరుతో దోపిడీ

నిధులన్నీ ఏపీఎ్‌సడీసీకి మళ్లింపు

మెచ్యూర్‌ అయినా చెల్లింపుల్లేవ్‌

33 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మొత్తం 4,736 కోట్లను బలవంతంగా ఏపీఎస్‌ఎఫ్‌సీలో డిపాజిట్లు చేయించారు. ఇందులో చాలా వరకు ఏపీ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)కు నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారు. ఇంటర్‌ కార్పొరేట్‌ డిపాజిట్ల రూపంలో తీసుకున్న డిపాజిట్లు ఎప్పుడో రెండున్నరేళ్ల క్రితమే మెచ్యూర్‌ అయినా ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. 4 సంస్థలకు మాత్రం వడ్డీ లేకుండా అరకొరగా చెల్లించారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ సర్కారు ఆర్థిక అవకతవకలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. నిబంధనలకు పాతరేసి మరీ నిధులు దారి మళ్లించిన లీలలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థల నుంచి డిపాజిట్లు చేయించుకుని, తిరిగి చెల్లించకుండా సాగించిన దోపిడీ తాజాగా వెలుగు చూసింది. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫసీ) ద్వారా ఈ వ్యవహారం నడిపించింది. 33 ప్రభుత్వ రంగ సంస్థలు/శాఖల నుంచి రూ.4,736 కోట్లు డిపాజిట్ల రూపంలో తీసుకుని చాలా వరకు తిరిగి చెల్లించలేదు. వాటి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి చేయిచాపే దుస్థితికి దిగజార్చింది. ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి నిధులు లాక్కొనేందుకు జగన్‌ సర్కారు మొదట ఏపీఎ్‌సఎ్‌ఫసీని ఏర్పాటు చేసింది. నిధులను ఇందులో డిపాజిట్‌ చేయాలని బలవంతం చేసింది. అయితే చాలా సంస్థలు, శాఖలు, కార్పొరేషన్లు ఇందుకు అంగీకరించలేదు. దీంతో అప్పట్లో సీఎంవోలో ఉన్న ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ రంగంలోకి దిగారు. ఆయా సంస్థలకు లేఖలు రాయడంతో పాటు స్వయంగా ఫోన్లు చేసి ఎస్‌ఎ్‌ఫసీలో డిపాజిట్లు చేయాలని ఒత్తిడి చేశారు. 33 కార్పొరేషన్లు, సంస్థల నుంచి రూ.4,736 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఈ నిధుల్లో చాలావరకు ఏపీ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ)కు మళ్లించారు. డిపాజిట్లను ఇంటర్‌ కార్పొరేట్‌ డిపాజిట్లు (ఐసీడీ)ల రూపంలో తీసుకున్నారు. ఒక్కో ఐసీడీ కాలపరిమితి 6 నుంచి 12 నెలలు. అంటే కొన్ని శాఖల డిపాజిట్లు 6 నెలల్లో మెచ్యూర్‌ అయితే, మరికొన్ని సంస్థల డిపాజిట్లు 12 నెలల్లో ఏదో ఒక నెలలో మెచ్యూర్‌ అవుతాయి. మెచ్యూరిటీ సమయానికి అసలు, వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలి. ఇలా 33 కార్పొరేషన్లు, సంస్థల నుంచి బలవంతంగా తెచ్చుకున్న ఐసీడీలు ఎప్పుడో రెండున్నరేళ్ల క్రితమే మెచ్యూర్‌ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క శాఖకు కూడా పూర్తిస్థాయిలో వడ్డీ, అసలు తిరిగి ఇవ్వలేదు. నాలుగైదు శాఖలకు వడ్డీ ఇవ్వకపోగా అసలులోనే కొంత కోత పెట్టారు. మిగిలిన శాఖల ఐసీడీలు మూడేళ్ల నుంచి అలాగే ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదు. పైగా ఈ ఐసీడీల కాలపరిమితి ముగియగానే మరో 6 నెలల నుంచి 12 నెలల వరకు వాటి గడువు పెంచుకుంటూ పోతున్నారు. చిట్టీలు కట్టించుకునే సంస్థల తరహాలో ఏపీఎ్‌సఎ్‌ఫసీ కార్యకలాపాలు జరిగాయి.


నిధులన్నీ ఏపీఎస్ డీసీకి

వివాదాస్పద ఏపీ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ)కు డబ్బులు సమకూర్చడం కోసం జగన్‌ సర్కారు ఎస్‌ఎ్‌ఫసీని ఏర్పాటు చేసింది. ఎస్‌ఎ్‌ఫసీ ద్వారా రూ.4,736 కోట్లు డిపాజిట్లు తీసుకొని, అందులో రూ.3,699 కోట్లు ఏపీఎ్‌సడీసీకి లోను రూపంలో ఇచ్చారు. ఇందులో రూ.560 కోట్లను కోడ్‌ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు, మార్చి 15న ఎస్‌ఎ్‌ఫసీ నుంచి ఏపీఎ్‌సడీసీకి ఎలాంటి ష్యూరిటీ లేకుండా అన్‌సెక్యూర్డ్‌ లోను రూపంలో ఇచ్చారు. ఈ డబ్బును అస్మదీయులకు బిల్లులు చెల్లించడం కోసం వాడారనే ఆరోపణలున్నాయి.


ఆర్బీఐ ఏం చేస్తోంది?

ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ను 2020 ఏప్రిల్‌లో ఏర్పాటు చేశారు. బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా రిజర్వ్‌ బ్యాంకు నుంచి 2020 నవంబరులో సర్టిఫికెట్‌ తెచ్చుకున్నారు.పబ్లిక్‌ డిపాజిట్లు కాకుండా కేవలం ఇంటర్‌ కార్పొరేట్‌ డిపాజిట్లు (ఐసీడీలు) స్వీకరించేలా అనుమతి తీసుకున్నారు. కానీ ఐసీడీలను తిరిగి చెల్లించడం పూర్తిగా మానేశారు.ఎన్‌బీఎ్‌ఫసీల విషయంలో కొన్నేళ్లుగా ఆర్‌బీఐ కొరడా ఝుళిపిస్తోంది. చిన్నాచితక నుంచి ఓ స్థాయి ఎన్‌బీఎ్‌ఫసీలన్నీ మూతపడ్డాయి. టాటా లాంటి పెద్దస్థాయి ఎన్‌బీఎ్‌ఫసీలు మనుగడలో ఉన్నాయి. అలాంటిది ఎస్‌ఎ్‌ఫఎస్‌ ప్రభుత్వ శాఖల ఐసీడీలతో చెలగాటమాడుతుంటే ఆర్‌బీఐ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? పైగా తీసుకున్న ఐసీడీల్లో 90 శాతాన్ని ఒకేఒక్క కార్పొరేషన్‌కు లోనుగాఇచ్చారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమే.


ప్రభుత్వ శాఖల హాహాకారాలు

ఇంటర్మీడియట్‌ బోర్డు డిపాజిట్‌ చేసిన నిధుల్లో రూ.63.38 కోట్లు మెచ్యూర్‌ అయ్యాయి. అయితే ఎస్‌ఎ్‌ఫసీ రూ.44.83 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.18.55 కోట్లు ఇంకా ఇవ్వలేదు. డిపాజిట్‌ చేసిన డబ్బుల్లో మెచ్యూర్‌ అయిన రూ.22.99 కోట్లను తిరిగివ్వాలని కోరుతూ ఇంటర్మీడియట్‌ బోర్డు 2023 ఫిబ్రవరి 3న రాతపూర్వకంగా కోరింది. కానీ ఆ ఏడాది మార్చి 1వ తేదీన రూ.9.83 కోట్లు మాత్రమే చెల్లించింది. అలాగే 2023 మే 25న రూ.40.39 కోట్ల డిపాజిట్లు మెచ్యూర్‌ అయ్యాయని, తిరిగిచ్చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కోరింది. 2023 జూన్‌ 1న రూ.35 కోట్లు మాత్రమే చెల్లించారు.

మెచ్యూర్‌ అయిన 50కోట్ల డిపాజిట్లు తిరిగివ్వాలని ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కో రింది. అయితే ఎస్‌ఎ్‌ఫఎస్‌ 35కోట్లుమాత్రమే ఇచ్చింది.

ఎన్‌ఐసీడీఐటీ 2021 ఆగస్టు 4వ తేదీన రూ.300 కోట్లు డిపాజిట్‌ చేసింది. ఈ ఐసీడీల కాలపరిమితి 6 నెలలే. తమ డిపాజిట్లు ఇచ్చేయాలంటూ 2022 జనవరి 31న ఎస్‌ఎ్‌ఫసీకి ఎన్‌ఐసీడీఐటీ లేఖ రాసింది. అయితే ఎస్‌ఎ్‌ఫసీ స్పందించలేదు. దాదాపు రెండేళ్లపాటు లేఖలు రాయడంతో చివరికి 2023 డిసెం బరులో రూ.300 కోట్లను తిరిగిచ్చింది.

ఏపీమారిటైమ్‌ బోర్డు 2021 జూలైలో 200 కోట్లు, అదే ఏడాది అక్టోబరులో 1000 కోట్లు డిపాజిట్‌ చేసింది. ఆ తర్వాత 2021 అక్టోబరు, నవంబరు, డిసెంబరులో తమ డిపాజిట్లు వెనక్కివ్వాలంటూ మారిటైమ్‌బోర్డు లేఖలతో దండయాత్ర చేసింది. మొత్తం రూ.1200 కోట్లకు గాను, అతికష్టమ్మీద రూ.683 కోట్లు మాత్రమే వెనక్కిచ్చారు. మిగిలిన డబ్బు ఎస్‌ఎ్‌ఫసీ వద్దే ఉంది.


విశాఖ నిలువు దోపిడీ

2021లో విశాఖ కలెక్టర్‌ నుంచి రూ.50 కోట్లు తీసుకుని ఏపీఎ్‌సఎ్‌ఫసీలో డిపాజిట్‌ చేసుకున్నారు. అక్కడ్నుంచి ఏపీఎ్‌సడీసీకి మళ్లించారు. మూడేళ్లవుతున్నా ఇంతవరకూ తిరిగి చెల్లించలేదు. ఇదివరకే విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భూములను బ్యాంకులకు తనఖా రిజిస్ర్టేషన్‌ చేసి అప్పులు తెచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రపై ప్రత్యేక ప్రేమ ఒలకబోసే జగన్‌ సర్కారు... విశాఖలో చేసిన నిర్వాకమిదీ.


బాధ్యత వహిస్తారా?

మార్గదర్శిలో అవకతవకలు జరిగినట్టు జగన్‌ సర్కారు కేసులు నమోదు చేసింది. అవి ఎంత వరకూ నిజమో కానీ మార్గదర్శిపై ఫిర్యాదు చేసినట్టే ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫసీ)లో కూడా జరిగాయి. జగన్‌ సర్కారు ఏపీఎ్‌సఎ్‌ఫసీ పేరుతో వేలకోట్ల రూపాయలు డిపాజిట్లు చేయించుకుంది. వడ్డీలు కట్టకుండా, మెచ్యూర్‌ అయిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా, నిధులన్నీ ఒకే సంస్థకు మళ్లిస్తూ గోల్‌మాల్‌ చేస్తోంది. అయినా డబ్బులు డిపాజిట్‌ చేసిన ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌, మారిటైమ్‌బోర్డు వీసీ, ఎండీ, ఎన్‌ఐసీడీఐటీ ఎండీ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వీసీ, ఎండీలు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇవే అభియోగాలతో మార్గదర్శిపై ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు పెట్టినప్పుడు, వీరు ఎస్‌ఎ్‌ఫసీపై కేసులు ఎందుకు పెట్టడం లేదు? నిధుల మళ్లింపు, అకౌంట్లలో తేడాలు, అవసరమైన లెడ్జర్లు నిర్వహించకపోవడం, మెచ్యూరిటీ సమయానికి డిపాజిటర్లకు నగదు అందజేయకపోవడం వంటి తేడాలు మార్గదర్శిలో గుర్తించినట్లు సీఐడీ చెప్పింది. ఈ అభియోగాలు ఏపీఎ్‌సఎ్‌ఫసీలోనూ కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తప్పు చేస్తే కంపెనీ మీదే కాకుండా ఆ సమయంలో కంపెనీలో బాధ్యతల్లో ఉన్న అందరిపైనా చర్యలు తీసుకోవచ్చంటూ మార్గదర్శిలో పైస్థాయి వ్యక్తులను విచారించారు. ఇదేవిధంగా సీఎం జగన్‌తో పాటు ఎస్‌ఎ్‌ఫసీలో డైరెక్టర్లుగా ఉన్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రావత్‌, సత్యనారాయణ, చిరంజీవి చౌదరి, ప్రస్తుత సీఎస్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి బాధ్యత వహించాలి. అలాగే ప్రభుత్వం తరఫున వివిధ సంస్థలు, కార్పొరేషన్లకు లేఖలు రాసి బలవంతంగా డిపాజిట్లు చేయించిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ కూడా ఈ అవకతవకలకు బాఽధ్యుడే. మరి వీరిపై కేసులు పెడతారా?

Updated Date - May 26 , 2024 | 01:57 PM