Share News

Balineni Srinivas: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడని సీఎం అంటున్నారు: బాలినేని

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:31 PM

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సర్దుకుపోయి ఇబ్బందులు పడుతున్నానని, అవసరమైతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. ‘‘నేను సీఎంని ఏదైనా అడిగితే వాసు అలిగాడని అంటున్నారు. నేను అలిగింది ప్రజల కోసమే.. నా కోసం కాదు. 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైదరాబాద్‌లో కూర్చున్నాను. వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడని సీఎం ఇంటెలిజెన్స్ అధికారులతో అంటున్నారు’’ అని అన్నారు.

Balineni Srinivas: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడని సీఎం అంటున్నారు: బాలినేని

ప్రకాశం: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సర్దుకుపోయి ఇబ్బందులు పడుతున్నానని, అవసరమైతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. ‘‘నేను సీఎం జగన్‌ని (CM Jagan) ఏదైనా అడిగితే వాసు అలిగాడని అంటున్నారు. నేను అలిగింది ప్రజల కోసమే.. నా కోసం కాదు. 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైదరాబాద్‌లో కూర్చున్నాను. వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడని సీఎం ఇంటెలిజెన్స్ అధికారులతో అంటున్నారు. ప్రజల్లో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. సీఎం దగ్గర అందరిలాగా నేను డబ్బాలు కొట్టను. ఇంత కంటే నాకు పోయేదేమీ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మాగుంటతో పాటు టీడీపీలోకి పోవాలా...

‘‘మాగుంట శ్రీనివాసులు రెడ్డికి (Magunta Srinivasulu Reddy) ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని పోరాడాను. ఈ రోజు మాగుంట పార్టీకి రాజీనామా చేశారు. నేను సర్దుకుపోకుండా మాగుంటతో పాటు టీడీపీలోకి (TDP) పోవాలా. ఉన్న పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం నాది కాదు. చివరిసారిగా పోటీ చేస్తున్నాను. నాకు అందరి అశీస్సులు కావాలి. ఐదేళ్లలో ఎన్జీవో ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడ్డారు. పీఆర్సీ విషయంలో సీఎంతో గతంలో చర్చించాను. ఉద్యోగులు మన మీద వ్యతిరేకంగా ఉన్నారని సీఎం జగన్‌కి చెప్పాను. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు త్వరలోనే వస్తాయి. ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం దగ్గర పోరాడతాను’’ అని బాలినేని శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి..

Shock for YCP: నెల్లూరు నగరంలో వైసీపీకి భారీ షాక్

Chandrababu: అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2024 | 05:04 PM