Share News

Drugs: రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

ABN , Publish Date - Mar 21 , 2024 | 07:52 PM

విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్‌ను కస్టమ్స్, సీబీఐ అధికారులు కలిసి సీజ్ చేశారు. బెయ్యి బ్యాగులను సీజ్ చేశారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఆపరేషన్ గరుడ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Drugs: రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

విశాఖపట్టణం: విశాఖపట్టణం (Vizag) షిప్పింగ్ యార్డ్‌లో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్‌ను (Drugs) కస్టమ్స్, సీబీఐ అధికారులు కలిసి సీజ్ చేశారు. వెయ్యి బ్యాగులను సీజ్ చేశారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్టణం పోర్టుకు డ్రగ్స్ వస్తున్నాయని ఇంటర్ పోల్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చింది. కస్టమ్స్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఓ ప్రైవేట్ సంస్థ డ్రగ్స్ దిగుమతి చేసిందని అధికారులు ప్రాథమికంగా తెలిపారు.

బ్రెజిల్‌లో గల శాంటోస్ పోర్టు నుంచి నుంచి కన్‌సైన్‌మెంట్ వస్తుందని ఇంటర్ పోల్ నుంచి సీబీఐ అధికారులకు సమాచారం అందింది. విశాఖపట్టణం కస్టమ్స్ విభాగాన్ని సమన్వయం చేసుకొని ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో దాడులు నిర్వహించారు. విశాఖపట్టణానికి చెందిన కన్సిగ్నీ అనే ప్రైవేట్ కంపెనీ కన్‌సైన్‌మెంట్ బుక్ చేసిందని సీబీఐ అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇతర పదార్థాలతో డ్రగ్స్ కలిపి అంతర్జాతీయ ముఠా దిగుమతి చేస్తుంటారు. ఇక్కడ కూడా అదేవిధంగా డ్రగ్స్ దిగుమతి చేశారు. ఇదివరకు కూడా ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 08:26 PM