AP NEWS: పంచాయతీరాజ్ వ్యవస్థను సీఎం జగన్ సర్వ నాశనం చేశారు: పాపారావు
ABN , Publish Date - Feb 05 , 2024 | 10:14 PM
పంచాయతీరాజ్ వ్యవస్థను సీఎం జగన్ సర్వ నాశనం చేశారని ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాపారావు అన్నారు. రేపు సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం తలపెట్టిన చలో అసెంబ్లీ కి మద్దతు తెలిపారు.
అమరావతి: పంచాయతీరాజ్ వ్యవస్థను సీఎం జగన్ సర్వ నాశనం చేశారని ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాపారావు అన్నారు. రేపు సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం తలపెట్టిన చలో అసెంబ్లీ కి మద్దతు తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ చలో అసెంబ్లీ కార్యక్రమంలో సర్పంచులు అందరూ కూడా పాల్గొనాలని పిలుపునిస్తున్నామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం , ఏ ముఖ్యమంత్రి పెట్టని ఇబ్బందులు, సీఎం జగన్ సర్పంచులను ఇబ్బందులకు గురిచేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎక్కువమంది వైసీపీ సానుభూతిపరులు అయిన సర్పంచులుగా గెలిచిన వారికి అధికారాలు లేవని తెలిపారు.వలంటరీ వ్యవస్థ ద్వారా సర్పంచులను ఉత్సవ విగ్రహాలను చేశారని పాపారావు ఆరోపించారు.