Share News

Congress: ఆది నుంచి అమరావతి ఉద్యమానికి అండగా నిలిచాం: జేడి శీలం

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:23 PM

తుళ్లూరు (అమరావతి): ఆది నుంచి అమరావతి ఉద్యమానికి అండగా నిలిచామని, రైతులు, రైతు సంఘాల జేఏసీలతో సోమవారం దీక్షా శిబిరాల్లో చర్చించామని కాంగ్రెస్ సీనియర్ నేత జేడి శీలం వ్యాఖ్యానించారు.

Congress: ఆది నుంచి అమరావతి ఉద్యమానికి అండగా నిలిచాం: జేడి శీలం

తుళ్లూరు (అమరావతి): ఆది నుంచి అమరావతి (Amaravati) ఉద్యమానికి అండగా నిలిచామని, రైతులు (Farmers), రైతు సంఘాల జేఏసీ (Farmers Unions JAC)లతో సోమవారం దీక్షా శిబిరాల్లో చర్చించామని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) జేడీ శీలం (JD Seelam) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన తుళ్లూరులోని మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగే బహిరంగ సభకు రావాలని రైతులను కోరామన్నారు. రైతులు అందరూ వచ్చి మహసభను విజయవంతం చేయాలని తమ అధ్యక్షురాలు షర్మిల మాటగా చెప్పామన్నారు.

గుంటూరులో జరిగే ఈ సభకు కర్నాటక ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ (DK Shivakumar) హజరవుతారని, ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమానికి కనీస మద్దతు ధర ఉండాలని చెప్పడమే కాకుండా ఒక చట్టం చేయాలనేదానికి కట్టుబడి ఉన్నామని జేడీ శీలం అన్నారు. ఎంఎస్ స్వామినాధన్ రికమండేషన్లకు రాయపూర్‌లోనే ఆమోదం తెలిపామని, స్వామినాధన్‌కు భారత రత్న ఇస్తారని, కానీ ఆయన చెప్పిన వాటిని ఆచరించరని విమర్శించారు. రాజధాని రైతు శిబిరాలకు వెళ్లి షర్మిల సభకు రావాలని రైతులను ఆహ్వనించామన్నారు. అనంతరం అమరావతి రైతు జేఏసీ నేతలతో జేడి శీలం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ భేటీ అయ్యారు.

Updated Date - Mar 04 , 2024 | 01:26 PM