Share News

Illegal Mining: అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టు సీరియస్

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:51 PM

అమరావతి: ఏపీలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సీరియస్ అయింది. అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించింది. గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వీరంకినాయుడు పాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎం ప్రభుదాస్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది.

Illegal Mining: అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టు సీరియస్

అమరావతి: ఏపీ (AP)లో అక్రమ మైనింగ్‌ (Illegal Mining)పై హైకోర్టు (High Court) సీరియస్ అయింది. అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించింది. గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వీరంకినాయుడు పాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎం ప్రభుదాస్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. డీకే పట్టా భూమి 60 ఏకరాల్లో రెండు ఏకరాల్లో అనుమతి తీసుకుని.. 60 ఏకరాల్లో ఫెన్సింగ్ వేసి ఎవరినీ రానివ్వకుండా మైనింగ్ చేస్తున్నారని ఫోటోలతో సహా న్యాయవాది న్యాయస్థానానికి ఆధారాలు చూపించారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ మైనింగ్‌పై అనేక ఫిర్యాదులు కోర్టుకు వస్తున్న పట్టించుకోవడం లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

బెంచ్ పాయింట్ ఔట్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని మైనింగ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. అయితే రెండు వారాల సమయం చాలదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో ఏదైనా ఉపగ్రహానికి వెళ్లి రిపోర్ట్ తేవాలా అని న్యాయస్థానం ప్రశ్నించింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడా ఉంటే స్థానికంగా ఉన్న న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, అనుమతి ఇచ్చిన మైనింగ్ జిల్లా అధికారులను కోర్టుకు పిలిపిస్తామని హైకోర్టు చెప్పింది. తప్పని తేలితే అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.

Updated Date - Feb 28 , 2024 | 12:53 PM