Share News

Galla Jayadev: రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్ బై !!

ABN , Publish Date - Jan 28 , 2024 | 09:28 AM

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు వీడ్కోలు చెప్పబోతున్నారు. గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు క్యాడర్‌కు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఆత్మీయ విందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు హాజరుకానున్నారు.

Galla Jayadev: రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్ బై !!

గుంటూరు: టీడీపీ కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) రాజకీయాలకు వీడ్కోలు చెప్పబోతున్నారని తెలుస్తోంది. గుంటూరు నుంచి ఆయన రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి పోటీకి ఆయన అనాసక్తిగా ఉన్నారు. దీంతో గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు క్యాడర్‌కు ఆయ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఆత్మీయ విందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు హాజరుకానున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితం గల్లా జయదేవ్ కుటుంబం ప్రకటన చేసింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్... తల్లి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, రెండుసార్లు ఎంపీగా గెలిచారు. జయదేవ్‌‌కు అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఉంది. ఇతర వ్యాాపారాలు కూడా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కూతురితో జయదేవ్‌‌కు వివాహం జరిగిన విషయం తెలిసిందే.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 28 , 2024 | 10:05 AM