Share News

NTR Bharosa : 5,402 కొత్త పింఛన్లు

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:12 AM

ఎన్టీఆర్‌ భరోసా కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని ..

NTR Bharosa : 5,402 కొత్త పింఛన్లు

  • భర్త చనిపోతే... ఆ పెన్షన్‌ భార్యకు: మంత్రి కొండపల్లి

  • త్వరలో లక్ష ఇళ్లు అప్పగింత: మంత్రి పార్థసారథి

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ‘ఆరేడు నెలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికాం. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛను ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చాం. దీనిని స్పౌజ్‌ కేటగిరీగా గుర్తిస్తూ పెన్షన్‌ మంజూరు చేస్తున్నాం. సీఎం చంద్రబాబు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ నెల నుంచి పంపిణీ చేస్తున్నాం. అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు ఇస్త్తున్నాం. వారికి డిసెంబరు 31న రూ.4 వేల చొప్పున పింఛను పంపిణీ చేయనున్నాం. గత 3నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పెన్షన్‌ తీసుకోకుండా ఉన్న 50 వేల మందికి సైతం బకాయిలతో సహా అందించనున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 04:12 AM