Share News

YCP: మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవికి నిరసన సెగ

ABN , Publish Date - Mar 01 , 2024 | 01:13 PM

మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవికి సెగ తగిలింది. చిరంజీవిని బాప్టిస్ట్ పేట వాసులు నిలదీశారు. పేదవారంటే ఎవరు... పెత్తందారులు అంటే ఎవరంటూ నిలదీశారు. పెత్తందారులు అయిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు సిమెంటు రోడ్లు ఎందుకు ఉన్నాయి?.. పేదవాళ్లమయిన తమ ఇంటి ముందు ఎందుకు గుంటల రోడ్లు ఉన్నాయని ప్రశ్నించారు.

YCP: మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవికి నిరసన సెగ

అమరావతి: మంగళగిరి వైసీపీ (YCP) ఇన్‌చార్జి గంజి చిరంజీవి (Ganji Chiranjeevi)కి సెగ తగిలింది. చిరంజీవిని బాప్టిస్ట్ పేట వాసులు నిలదీశారు. పేదవారంటే ఎవరు... పెత్తందారులు అంటే ఎవరని ప్రశ్నల వర్షం కురిపించారు. పెత్తందారులు అయిన ఎమ్మెల్సీ (MLC) మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు సిమెంటు రోడ్లు ఎందుకు ఉన్నాయి?.. పేదవాళ్లమయిన తమ ఇంటి ముందు ఎందుకు గుంటల రోడ్లు ఉన్నాయని ప్రశ్నించారు. మా రోడ్లను పగలగొట్టి ఇలాగే ఎందుకు వదిలేశారని నిలదీశారు. సమాధానం చెప్పలేక నవరత్నాలు.. పథకాలు అని గంజి చిరంజీవులు ఏదేదో చెప్పబోయారు. నవరత్నాల సంగతి పక్కనపెట్టి ముందు రోడ్ల గురించి చెప్పాలంటూ చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 01:13 PM