Share News

AP Voters: ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల..

ABN , Publish Date - Jan 22 , 2024 | 02:44 PM

Andhrapradesh: వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. సోమవారం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈవోఆంధ్ర.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ 2024 పేరుతో తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించింది.

AP Voters: ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల..

అమరావతి, జనవరి 22: వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఏపీ ఓటర్ల తుది జాబితా (Voters List) విడుదలైంది. సోమవారం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. సీఈవోఆంధ్ర.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ 2024 పేరుతో తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం పబ్లిష్ చేసింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఫైళ్ళను ఈసీ అప్‌లోడ్ చేసింది.

గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితాపై అనేక విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జీరో డోర్ నెంబర్‌తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తుది ఓటర్‌ జాబితాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. తుది జాబితాలో కూడా తప్పులు దొర్లితే అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని ఆందోళన నెలకొంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేసి నకిలీ కార్డ్‌లు సృష్టించడంపై ఈసీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ఐఏఎస్ అధికారితో పాటు, మరికొంత మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో తుది వాటర్లో జాబితాలో తప్పులు వస్తే తమపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని జాబితా రూపకల్పనలో ఉన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 22 , 2024 | 02:53 PM