Share News

Ex Minister: గుండెపోటుతో మాజీ మంత్రి సీతాదేవి మృతి

ABN , Publish Date - May 27 , 2024 | 10:06 AM

మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో ఆమె తుది శ్వాస‌ విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. . ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

Ex Minister: గుండెపోటుతో మాజీ మంత్రి సీతాదేవి మృతి

అమరావతి: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో ఆమె తుది శ్వాస‌ విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. . ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీతాదేవి బీజేపీలో చేరారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Jagan Govt : గల్లా పెట్టెలు ఖాళీ


యెర్నేని సీతాదేవి మాత్రమే కాకుండా ఆమె కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే కావడం గమనార్హం. ఆమె భర్త నాగేంద్రనాథ్‌ ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. నాగేంద్రనాథ్ ఏడాది క్రితం మరణించారు. నాగేంద్రనాథ్, సీతా దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 27 , 2024 | 10:06 AM