Share News

AP Politics: లిక్కర్ షాపుల్లో క్యాష్‌కు లెక్క పత్రాలు ఉన్నాయా జగన్: గంటా శ్రీనివాస రావు

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:28 AM

అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్‌తో లావాదేవీలు జరుగుతాయని, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో మాత్రం జరగవని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో ఉన్న నగదు ఎటు వెళుతుందని అడిగారు. ఆ నగదుకు సంబంధించి లెక్కా పత్రాలు ఉన్నాయా అని అడిగారు.

AP Politics: లిక్కర్ షాపుల్లో క్యాష్‌కు లెక్క పత్రాలు ఉన్నాయా జగన్: గంటా శ్రీనివాస రావు

విశాఖపట్టణం: అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్‌తో లావాదేవీలు జరుగుతాయని, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో మాత్రం జరగవని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) విమర్శించారు. టీ స్టాల్, పాన్ షాపు నుంచి మాల్స్ వరకు అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో ఉన్న నగదు ఎటు వెళుతుందని అడిగారు. ఆ నగదుకు సంబంధించి లెక్కా పత్రాలు ఉన్నాయా అని అడిగారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

డబ్బులు వేసి.. ఆ వెంటనే..

ఆ మద్యం షాపుల్లో కల్తీ మద్యం లభిస్తుందని గంటా శ్రీనివాస రావు విమర్శించారు. నాలుగున్నర ఏళ్ల నుంచి జే బ్రాండ్ హానికర కిక్ నింపారని మండిపడ్డారు. విచ్చలవిడిగా నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. ఓ వైపు మద్యంతో డబ్బులు తీసుకుంటూ.. మరోవైపు జగనన్న సురక్ష అని ప్రజల వద్దకు వస్తున్నారని గంటా శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. అమ్మ ఒడి పేరుతో డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బు వారి వద్ద నిలవడం లేదని వివరించారు. ఆ నగదునే నాన్న మందు కోసం తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

కల్తీ మద్యం

రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని గొప్పలు చెప్పారు. నిజానికి ఇక్కడ మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా రేట్లు విధించి దోస్తున్నారని గంటా శ్రీనివాస రావు విరుచుకుపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ప్రజలు గుర్తుంచుకున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 10:28 AM