Share News

Andhra Pradesh Elections: ఓటమి భయం.. ప్రలోభాల పర్వం.. వైసీపీ నేతల బరి తెగింపు!

ABN , Publish Date - Mar 27 , 2024 | 08:52 AM

ఎన్నికల్లో గెలుపే రాజకీయ పార్టీల లక్ష్యం. ప్రజలకు తాము గతంలో ఏమి చేశాం.. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి.. ఓట్లు వేయమని అడుగుతుంటారు. ఎన్నికల వేళ సాధారణంగా కనిపించే దృశ్యాలు ఇవి. కాని ప్రస్తుత ఎన్నికల స్వభావాన్నే మార్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమి లేకపోవడంతో.. ఓటర్లను ప్రలోభపెట్టి గెలుపొందే ప్రయత్నాలు చేస్తోంది.

Andhra Pradesh Elections: ఓటమి భయం.. ప్రలోభాల పర్వం.. వైసీపీ నేతల బరి తెగింపు!

ఎన్నికల్లో గెలుపే రాజకీయ పార్టీల లక్ష్యం. ప్రజలకు తాము గతంలో ఏమి చేశాం.. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి.. ఓట్లు వేయమని అడుగుతుంటారు. ఎన్నికల వేళ సాధారణంగా కనిపించే దృశ్యాలు ఇవి. కాని ప్రస్తుత ఎన్నికల స్వభావాన్నే మార్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ(YCP) గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమి లేకపోవడంతో.. ఓటర్లను ప్రలోభపెట్టి గెలుపొందే ప్రయత్నాలు చేస్తోంది. గత ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాల ద్వారా సంపాదించిన డబ్బులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రలోభాలకు లొంగకపోతే.. బెదిరింపులకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు వైఎస్.జగన్ తన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని.. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి అధికారాన్ని అప్పగించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామిని జగన్ మర్చిపోయారనే విమర్శలు ఉన్నాయి. రైతులు, యువత, మహిళలు.. ఇలా అన్ని వర్గాలను జగన్ మోసం చేశారనే టాక్ వినిపిస్తోంది. పాలనను పక్కన పెట్టి.. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి ఐదేళ్ల సమయం కేటాయించారనే ఆరోపణలు వైసీపీ ప్రభుత్వంపై ఉన్నాయి. దీంతో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేక.. ప్రలోభాల ద్వారా ఓట్లు పొందే కుట్రకు వైసీపీ తెరలేపినట్లు తెలుస్తోంది.

AP Politics: సంక్షేమ పాలన కోసం టీడీపీని గెలిపించాలి: వసంత కృష్ణ ప్రసాద్

మహిళలకు చీరలు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మహిళలకు చీరలు పంచిపెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఓటు వేయాలని కోరుతూ ఆయా నియోజకవర్గాల్లో మహిళలందరికీ పార్టీ క్యాడర్ ద్వారా అందిస్తున్నారట. ఓటరు కార్డులు చూపించిన వారికి ఈ చీరలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓటు ఉండి ఓటరు కార్డు లేని వాళ్లు ఓటరు కార్డు ప్రింట్ కోసం మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. చీరలు ఇస్తూ వైసీపీకే ఓటు వేయాలని కొంతమంది మహిళల దగ్గర ఒట్టు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి. ఓటు కోసం ప్రజలకు బహుమతులు ఆశ చూపించి ప్రలోభాలకు గురిచేయడం నేరం అవుతుంది. తాము చేస్తున్నది తప్పని తెలిసినా గెలుపు కోసం వైసీపీ అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి పారిశ్రామిక వాడలోని ఓ గోడౌన్‌లో జగన్ ఫోటోతో ఉన్న 5 వేల చీరలను ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు..

వైసీపీ నేతల ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈసీ అధికారులు సీరియస్‌గా తీసుకుంటుంటే.. కొన్ని చోట్ల ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్న అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నారు.

AP News: ఎన్నికల నిబంధనలు ఆ నలుగురు అధికారులకి వర్తించవా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Updated Date - Mar 27 , 2024 | 09:07 AM