Share News

AP Election 2024: ముసుగు వీరుడు మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడు.. జగన్‌పై చంద్రబాబు పంచ్‌లు

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:40 PM

ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో భాగంగా పుత్తూరు బహిరంగ సభలో పాల్గొన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తుండడంతో ముసుగు వీరుడు జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ఆస్తి.. ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉందని మండిపడ్డారు.

AP Election 2024: ముసుగు వీరుడు మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడు.. జగన్‌పై చంద్రబాబు పంచ్‌లు

పుత్తూరు: ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో భాగంగా పుత్తూరు బహిరంగ సభలో పాల్గొన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తుండడంతో ముసుగు వీరుడు జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ఆస్తి.. ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉందని మండిపడ్డారు. ఈయన తాను పేదవాడు అని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.


‘‘ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చే తేదీ మే 13. జగన్ అహంకారం కూలిపోయి, తాడేపల్లి ప్యాలెస్ ను బద్దలు కొట్టేది ఆ రోజే. సొంత తోబుట్టునే అవమానించిన రాక్షసుడు జగన్. మహిళను బాధపెట్టిన ఎవరూ బాగుపడలేదు’’ అని వైఎస్ జగన్‌పై చంద్రబాబు ధ్వజమెత్తారు. పన్నుల భారం లేని పరిపాలన అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ప్రజల్ని గొర్రెలను కొన్నట్టుగా కొని ఇష్టానుసారం చేశారని, ముసుగు వీరుడు మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడని పంచ్‌లు వేశారు. ‘అన్నా క్యాంటీన్’ రద్దు చేసినవాడు పెత్తందారా? పేదవాడా? అని టీడీపీ అధినేత ప్రశ్నించారు.


విదేశీ విద్య పథకాన్ని రద్దు చేసిన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ‘‘టిడ్కో ఇళ్లను రద్దు చేసిన పెత్తందారుడు జగన్. దళితుడిని చంపి ఇంటికి పంపిన వారితో కులికే పెత్తందారుడు జగన్. విద్యుత్ చార్జీలను 9 సార్లు పెంచిన పెత్తందారుడు జగన్. ప్రజల్ని మెప్పించండి తప్ప మిడిసి పడొద్దు’’ అని జగన్ సారధ్యంలోని వైసీపీని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. నేరస్తులు కరుడుగట్టిన వాళ్లు ఆ బ్యాచ్ వాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల రోజు వరకు పోరాడాలని టీడీపీ శ్రేణులు, ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Mar 27 , 2024 | 05:43 PM