Share News

AP Election 2024: మైలవరంలో కీలక పరిణామం.. చేతులు కలిపిన దేవినేని ఉమ, వసంత కృష్ట ప్రసాద్

ABN , Publish Date - Apr 21 , 2024 | 09:10 PM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024కు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు సమర్పించగా మరికొందరు సన్నద్ధమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ రేపు (సోమవారం) నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కార్యాలయానికి వసంత కృష్ట ప్రసాద్ వెళ్లారు.

AP Election 2024: మైలవరంలో కీలక పరిణామం.. చేతులు కలిపిన దేవినేని ఉమ, వసంత కృష్ట ప్రసాద్

విజయవాడ: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024కు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు సమర్పించగా మరికొందరు సన్నద్ధమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ రేపు (సోమవారం) నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కార్యాలయానికి వసంత కృష్ట ప్రసాద్ వెళ్లారు. ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు చర్చించారు. రేపటి నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ దేవినేని ఉమను వసంత కృష్ణ ప్రసాద్ ఆహ్వానించారు.


ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. వసంత కృష్ణప్రసాద్ ఈరోజు తనను కలిశారని చెప్పారు. పార్టీ కోసం ఇద్దరం కలిసి పని‌ చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబును సీఎంను చేస్తామని దేవినేని ఉమ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర క్షేమం కోరే నేడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో అందరం కలిసి పని చేస్తామని దేవినేని ఉమ అన్నారు. ‘‘ మా క్యాడర్ అంతా వసంత గెలుపునకు పని చేస్తారు. రేపు వసంత నామినేషన్‌లో పాల్గొంటాం. చంద్రబాబు సీఎం అవగానే డెల్టాకు నీరు ఇచ్చే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం’’ అని దేవినేని ఉమ అన్నారు.


ఉమతో నాకు ఎటువంటి విభేధాలు లేవు: వసంత కృష్ణ ప్రసాద్

దేవినేని ఉమతో తనకు ఎలాంటి విబేధాలు లేదని వసంత కృష్ణ ప్రస్తాద్ అన్నారు. దేవినేని ఉమను కలిసి రేపు తన నామినేషన్‌కు రావాలని ఆహ్వానించాని చెప్పారు. ‘‘నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు నాకు అండగా నిలిచారు. టీడీపీ అంటేనే నిబద్ధతతో ఉన్న కార్యకర్తల పార్టీ. ఉమతో నాకు ఎటువంటి బేధాలు లేవు. రాజకీయ పరమైన విబేధాలే గతంలొ ఉండేవి. వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వకపోవడమే కారణం. చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతా. దేవినేని ఉమ టీడీపీ కోసం ఎంతో పని చేశారు. భవిష్యత్తులో ఆయనకు మంచి గుర్తింపు, ‌ప్రాధాన్యత తప్పకుండా ఉంటాయి’’ అని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

కాగా టీడీపీ సీనియర్ లీడర్ అయిన దేవినేని ఉమామహేశ్వర రావుని పక్కన పెట్టిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీ అధినేత చంద్రబాబు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉమ అలకబూనారు. చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన దారికొచ్చారు. తాజాగా వీరిద్దరూ చేతులు కలపడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 09:24 PM