Share News

AP Politics: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 24 , 2024 | 04:23 PM

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓ పక్క ఓటమి భయం.. మరోపక్క వైజాగ్ డ్రగ్స్ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునే దారిలేక సతమతమవుతున్న అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి నేతల వలసలు దడ పుట్టిస్తున్నాయి. వరుస దెబ్బలు తింటున్న ఆ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

AP Politics: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly Election), పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Election) సమీపిస్తుండడంతో ఓ పక్క ఓటమి భయం.. మరోపక్క వైజాగ్ డ్రగ్స్ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునే దారిలేక సతమతమవుతున్న అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) నేతల వలసలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ఎదురు దెబ్బలు తింటున్న ఆ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి (Chintalapudi) నియోజకవర్గంలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా (Vunnamatla Eliza) వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో షర్మిలను (YS Sharmila) ఆదివారం ఆయన కలిశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజా వైఎస్సార్‌సీపీ టికెట్ నిరాకరించింది. మరో అభ్యర్థి కంభం విజయరాజుకి సీటు ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీసీకి గుడ్ చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.


కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నా: చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా

సొంత పార్టీ నేతలపై తనపై కుట్ర చేశారని కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎలీజా తెలిపారు. ‘‘ నన్ను ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా నన్ను పిలవలేదు. నాకు సమాచారం లేకుండానే రీజనల్ కో-ఆర్డినేటర్ సమావేశాలు పెట్టారు. ఈ విషయాన్ని చాలాసార్లు మా అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లాను. సరైన స్పందన రాలేదు. నా అవసరం పార్టీకి లేదేమో అనిపించింది. అందుకే వైసీపీని వీడాను. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నాను. చింతలపూడి నుంచి కాంగ్రెస్ బరిలో ఉంటాను. షర్మిల నాకు టికెట్ హామీ ఇచ్చారు’’ అని ఎలీజా అన్నారు.

ఇవి కూడా చదవండి

AP Elections: పవన్‌ను కలిసిన టీడీపీ నేతలు.. పిఠాపురం సీటుపైనే చర్చ..!

AP Politics: ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తాం... మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 05:00 PM