Share News

YS Sharmila: ఢిల్లీ చేరుకున్న షర్మిల.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు

ABN , Publish Date - Mar 31 , 2024 | 09:04 PM

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రి నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలో చర్చ జరుగుతోంది.

YS Sharmila: ఢిల్లీ చేరుకున్న షర్మిల.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు

ఢిల్లీ: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రి నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఏపీలో కాంగ్రెస్(Congress) పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలో చర్చ జరుగుతోంది. ఈ చర్చ అనంతరం సోమవారం జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా సూరజ్ హెగ్డే, మాణిక్కం ఠాగూర్, మేయప్పన్, వైఎస్ షర్మిలా రెడ్డి, రఘువీరా రెడ్డి,కొప్పుల రాజు ఉన్నారు. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. దీంతో త్వరలోనే ఏపీలో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది.


కాగా నేడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహరెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల (YS Sharmila) ఫోన్ చేసి పెన్షన్ పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్జప్తి చేశారు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ పెన్షన్ పంపిణీకి 10 రోజుల సమయం పడుతుందని సమాధానం ఇచ్చారు. దీంతో వైయస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు పెన్షన్ పంపిణీ జరగకుంటే మీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగుతామని జవహర్ రెడ్డిని హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థ లేకుంటే పెన్షన్ పంపిణీ చేయలేరా?.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లేరా? అంటూ సీఎస్‌పై వైయస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉంది దేనికని ఫోన్‌లోనే సీఎస్‌ను నిలదీశారు.

Updated Date - Mar 31 , 2024 | 09:04 PM