Share News

AP Election 2024: టీడీపీ ముందు బీజేపీ కీలక ప్రతిపాదన!

ABN , Publish Date - Mar 26 , 2024 | 06:09 PM

ఏపీలో కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న బీజేపీ నాయకత్వం టీడీపీ ముందు కీలక ప్రతిపాదన ఉంచింది. ఏపీ అసెంబ్లీ స్థానాల్లో అదనంగా మరో సీటును కేటాయించాలని బీజేపీ కోరుతోంది. మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పారని తెలుస్తోంది. అయితే అదనంగా కోరుతున్న సీటు ఏదనేది క్లారిటీగా తెలియరాలేదు.

AP Election 2024: టీడీపీ ముందు బీజేపీ కీలక ప్రతిపాదన!

విజయవాడ: ఏపీలో కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న బీజేపీ నాయకత్వం టీడీపీ ముందు కీలక ప్రతిపాదన ఉంచింది. ఏపీ అసెంబ్లీ స్థానాల్లో అదనంగా మరో సీటును కేటాయించాలని బీజేపీ కోరుతోంది. మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పారని తెలుస్తోంది. అయితే అదనంగా కోరుతున్న సీటు ఏదనేది క్లారిటీగా తెలియరాలేదు.

రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి తమకి కావాలని బీజేపీ పట్టుబడుతోందని తెలుస్తోంది. అయితే ఉమ్మడి కడప జిల్లాలో మూడు స్థానాలు ఇవ్వడం కష్టమని టీడీపీ చెబుతోంది. సోము వీర్రాజు కోసం రాజమండ్రి సిటీ లేదా రూరల్‌ సీటుపై బీజేపీ కన్నేసినట్టుగా తెలుస్తోంది. అనపర్తి స్థానానికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్ ఏదోఒకటి ఇవ్వాలని బీజేపీ కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండూ సిట్టింగ్ స్థానాలే కావడంతో కేటాయించేందుకు టీడీపీ ససేమిరా అంటున్నట్టు సమాచారం. ఈ సీట్ల విషయంపై క్లారిటీ కోసం టీడీపీతో బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.

Updated Date - Mar 26 , 2024 | 06:09 PM