Share News

AP News: అమ్మో పులి... ఫెన్సింగ్‌పై పులివెంట్రుకలు.. రక్తపు మరకలు...

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:28 AM

Andhrapradesh: జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని నల్లజర్ల, కొయ్యలగూడెం మండలాల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం కలవరానికి గురిచేస్తోంది. గత అర్ధరాత్రి సమయంలో నల్లజర్ల మండలం పోతవరం గ్రామ పొలాల్లో..

AP News: అమ్మో పులి... ఫెన్సింగ్‌పై పులివెంట్రుకలు.. రక్తపు మరకలు...

తూర్పుగోదావరి, ఫిబ్రవరి 1: జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని నల్లజర్ల, కొయ్యలగూడెం మండలాల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం కలవరానికి గురిచేస్తోంది. గత అర్ధరాత్రి సమయంలో నల్లజర్ల మండలం పోతవరం గ్రామ పొలాల్లో తిరిగాడి ప్రస్తుతం కొయ్యలగూడెం మండలం చిలకావారిపాకాల సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చిలకవారిపాకల పొలాల్లో ఫెన్సింగ్ దాటుతున్న సమయంలో ఐరన్ ఫెన్సింగ్ గుచ్చుకోవడంతో ఫెన్సింగ్‌పై పులి వెంట్రుకలు, రక్తపు మరకలు కనిపించాయి. వీటిని అటవీ అధికారులు గుర్తించారు. వచ్చిన దారిలోనే తిరిగి వెళుతూ రాబోయే 24 గంటల్లో కన్నాపురం అటవీ ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 01 , 2024 | 11:33 AM