Share News

Crime: కాకినాడ జిల్లాలో రూ. 5 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం..

ABN , Publish Date - Apr 12 , 2024 | 07:00 AM

కాకినాడ జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా, పెద్దాపురంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బీవీసీ లాజిస్టిక్స్‌కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం, 46 కేజీల వెండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Crime: కాకినాడ జిల్లాలో రూ. 5 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం..

కాకినాడ జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా (Kakinada Dist.), పెద్దాపురం (Peddapuram)లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బీవీసీ లాజిస్టిక్స్‌కు (BVC Logistics) సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం (Gold), 46 కేజీల వెండి (Silver) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి విశాఖపట్నం (Visakhapatnam) వెళ్తూ పెద్దాపురంలోని ఓ నగల దుకాణం నుండి వెండి తీసుకుని వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని పట్టుకుని పెద్దాపురం ఆర్వో కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా మూడు రోజుల క్రితం.. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద సోమవారం నిర్వహించిన పోలీసు తనిఖీల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు బీవీసీ లాజిస్టిక్‌ వాహనంలో రూ.12 కోట్ల విలువైన 16 కేజీల 528 గ్రాముల బంగారం, 30 కేజీల వెండి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపించకపోవడంతో వీటిని భద్రత నడుమ జాయింట్‌ కలెక్టర్‌, దెందులూరు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ లావణ్య వేణి పర్యవేక్షణలో ట్రెజరీకి పంపినట్లు పెదవేగి సీఐ కె.శ్రీనివాసకుమార్‌ తెలిపారు. అలాగే హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ఏలూరు వెళుతున్న మరో వాహనంలో రూ.15,52,300 నగదును గుర్తించారు. అలాగే ఎలాంటి పత్రాలు లేకుండా స్కూటీలో తీసుకువెళుతున్న రూ.12 లక్షల నగదును ఆకివీడులో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది సోమవారం సీజ్‌ చేశారు.

Updated Date - Apr 12 , 2024 | 07:09 AM