Share News

AP Elections: ఎమ్మెల్యే ద్వారంపూడిని ఏకిపారేసిన జనం..

ABN , Publish Date - Mar 22 , 2024 | 09:50 AM

చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యేలైతే తమ నియోజకవర్గానికి చేసింది శూన్యం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు. నేడు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి చుక్కెదురైంది. తొలిరోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన్ను జనం నిలదీశారు.

AP Elections: ఎమ్మెల్యే ద్వారంపూడిని ఏకిపారేసిన జనం..

కాకినాడ: ఏంటో ఈసారి వైఎస్సార్‌‌సీపీ (YSRCP)కి కాలం అస్సలు కలిసి వస్తున్నట్టు లేదు. ఎటు చూసినా చిక్కులే. ఎక్కడికెళ్లినా జనం నిలదీస్తున్నారు. పార్టీ అధినేత నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతల వరకూ ఈ పరిస్థితి తప్పడం లేదు. విపక్షాలన్నీ పార్టీకి వ్యతికమయ్యాయి. సరే విపక్షాలకు అధికార పక్షం ఎప్పుడూ నచ్చదులే అనుకుంటే సొంత చెల్లి, బాబాయి కూతురు కూడా వ్యతిరేకమే. పోనీలే వారి ఎదుర్కొన్న పరిస్థితులు వారినలా చేశాయంటే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలే ఇప్పుడు తమ ఏరియాలో వైఎస్సార్‌సీపీ నేత కనిపిస్తే చాలు ఒక ఆట ఆడుకుంటున్నారు. రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేయడమే కాకుండా రహదారులన్నింటినీ సర్వనాశనమైనా పట్టించుకున్న పాపాన పోలేదు.

TDP: నేడు టీడీపీ మూడో జాబితా విడుదల...!

ఏటిమొగ వచ్చి ఎన్ని ఏళ్లయ్యింది?

చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యేలైతే తమ నియోజకవర్గానికి చేసింది శూన్యం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు. నేడు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (MLA Dwarampudi Chandrasekhar Reddy)కి చుక్కెదురైంది. తొలిరోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన్ను జనం నిలదీశారు. కాకినాడ ఏటిమొగలో ద్వారంపూడికి మత్స్యకారులు చుక్కలు చూపించారు. ‘ఏటిమొగ వచ్చి ఎన్ని ఏళ్లయ్యింది? మా మత్స్యకారులకు ఏం చేశావని ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నావు’ అంటూ నిలదీశారు. ‘చెత్త మీద కూడా పన్ను వేస్తారా?’ అని మహిళలు ఫైర్ అయ్యారు. మరోచోటకు వెళ్లినా కూడా మహిళలు ఎమ్మెల్యేను వదల్లేదు. ఓ మహిళ కూర్చొన్న చోటి నుంచే కదలకుండా ద్వారంపూడిని ఏకిపారేసింది. లేచి నిలబడి మాట్లాడమని కోరినా మత్స్యకార మహిళ ఖాతరు చేయలేదు.

విశాఖలో కొకైన్‌ కలకలం

మీది అమ్ముడుపోయే జాతి..

ద్వారంపూడికి గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ‘మీది అమ్ముడుపోయే జాతి..’ అంటూ మత్స్యకారుల మనోభావాలను కించపరిచేలా గతంలో ద్వారంపూడి వ్యాఖ్యలు చేశారు. దీనిపై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఏపీ ఫిషర్‌మెన్‌ జేఏసీ చైర్మన్‌ సైకం రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ‘ఖబడ్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే ఎన్నికల్లో నీ సంగతి తేలుస్తాం..’ అని హెచ్చరించారు. 60 వేల మత్స్యకార ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి, ఆ జాతినే హేళన చేస్తూ అవమానిస్తావా? అని ధ్వజమెత్తారు. కుల దురహంకారి చంద్రశేఖర్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని, లేదంటే ఆయన వ్యాఖ్యల వెనుక వైసీపీ ప్రభుత్వం ఉందని భావించాల్సి వస్తుందన్నారు. అనంతరం ద్వారంపూడి ఫొటోను చెప్పుతో కొట్టి, కాళ్లతో తొక్కుతూ నిరసన తెలిపారు.

Lanka Dinakar: ఏందయ్యా జగనయ్యా.. ఏపీని గంజా ప్రదేశ్‌గా మార్చేశావ్ కదా!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 09:59 AM