Share News

Chandrababu: మా గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:28 PM

తూర్పు గోదావరి జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో ‘ రా కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ‘రా కదిలి రా’ అని పిలుపిస్తే మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారని..

Chandrababu: మా గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో ‘ రా కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ‘రా కదిలి రా’ అని పిలుపిస్తే మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారని.. చాలా సంతోషమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని.. తెలుగుదేశం, జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. రా కదలి రా పిలుపు టీడీపీ, జనసేన కోసం కాదని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమని, భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. ఒక సైకో పాలన రాష్ట్రంలో జరుగుతోందని, మానసిక రోగి పరిపాలిస్తున్నాడని చంద్రబాబు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. కాగా రా కదలిరా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు జిల్లాకు వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు పెద్దయెత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 29 , 2024 | 01:28 PM