Share News

Mahesh Babu: రెచ్చిపోయిన మహేష్ ఫ్యాన్స్.. థియేటర్ వద్ద పెట్రోల్‌తో వీరంగం..

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:50 PM

అమలాపురంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద అభిమానులు పెట్రోల్‌తో చెలగాటమాడారు.

Mahesh Babu: రెచ్చిపోయిన మహేష్ ఫ్యాన్స్.. థియేటర్ వద్ద పెట్రోల్‌తో వీరంగం..

కోనసీమ: అమలాపురంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద అభిమానులు పెట్రోల్‌తో చెలగాటమాడారు. మహేష్ బాబు మూవీ గుంటూరు కారం రూ.200 కోట్లు కలెక్షన్ చేయడంతో థియేటర్ వద్ద అభిమానులు హంగామా సృష్టించారు. థియేటర్ వద్ద మంటల్లో పెట్రోల్ వేయడంతో సినిమా చూడ్డానికి వచ్చిన వ్యక్తికి మంటలు అంటుకున్నాయి.

సినిమా రిలీజ్ రోజున థియేటర్ వద్ద దేవుడు రూపంలో మహేష్ బాబు ఫోటోను పెట్టి అభిమానులు హంగామా చేశారు. అదే రోజున రోడ్ల మీద ఉన్న బస్సులపైకి ఎక్కి వీరంగం సృష్టించారు. సోమవారం (నేడు) రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టిన సందర్భంగా వీరంగం సృష్టించారు. మహేష్ బాబు ఫ్లెక్సీ వద్ద పెట్రోల్‌తో హల్‌చల్ చేయడంతో ఓ వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో థియేటర్ వద్ద నుంచి జనం పరుగులు తీశారు.

Updated Date - Jan 29 , 2024 | 02:02 PM