Share News

TDP vs YCP: వైసీపీ ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్..

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:14 PM

తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకున్నాయి. సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఈనెల 19 న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి..

TDP vs YCP: వైసీపీ ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్..

తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో టీడీపీ (TDP) మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy), వైసీపీ (YCP) ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి (Satthi Suryanarayana Reddy)ల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకున్నాయి. సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఈనెల 19 న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి.. అక్కడ సిబ్బందికి స్వయంగా అందచేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే రావాలని సవాల్ (Challenge) చేశారు. అయితే రామకృష్ణారెడ్డి తన ఆసుపత్రికి వెళ్ళటంపై సూర్యనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నప్పుడు ఇంటికి వస్తే సంగతి తేల్చుతానంటూ ఎమ్మెల్యే ప్రతి సవాల్ చేశారు.

ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి సవాల్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. మార్చి 1వ తేదీ ఉదయం 11 గంటలకు మీ ఇంటికి వస్తా.. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా.? అంటూ ప్రతి సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల సవాళ్ళు, ప్రతి సవాళ్ళపై అనపర్తిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Feb 26 , 2024 | 01:15 PM