Share News

AP News: శ్రీశైలంలో భక్తుల ఆందోళన.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 23 , 2024 | 07:22 PM

శ్రీశైలం(Srisailam)లోని ఇష్టకామేశ్వరి ఆలయం టికెట్ కౌంటర్ వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. అమ్మవారి ఆలయం దర్శనానికి వెళ్లకుండా భక్తులను గిరిజనులు అడ్డుకున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో నిన్ననే (శుక్రవారం) నక్కంటి బీట్ ఫారెస్ట్ అధికారులు టికెట్లు ఇచ్చారు.

AP News: శ్రీశైలంలో భక్తుల ఆందోళన.. కారణమిదే..?

నంద్యాల: శ్రీశైలం(Srisailam)లోని ఇష్టకామేశ్వరి ఆలయం టికెట్ కౌంటర్ వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. అమ్మవారి ఆలయం దర్శనానికి వెళ్లకుండా భక్తులను గిరిజనులు అడ్డుకున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో నిన్ననే (శుక్రవారం) నక్కంటి బీట్ ఫారెస్ట్ అధికారులు టికెట్లు ఇచ్చారు. మూడు రోజుల పాటు టికెట్ల కోసం అష్టకష్టాలు పడ్డామని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం7 గంటల నుంచి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు కౌంటర్ వద్ద భక్తులు పడిగాపులు గాస్తున్నారు. అటవీశాఖ సిబ్బందికి గిరిజనులు మధ్య అంతర్గత వివాదాలతో అమ్మవారి దర్శనానికి గిరిజనులు అనుమతించడం లేదని భక్తులు చెప్పారు. ఆలయం టికెట్ కౌంటర్ల వద్ద కనీస సదుపాయాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నచ్చజెప్పటంతో ఈ వాగ్వాదం సద్దుమణిగింది.

Updated Date - Mar 23 , 2024 | 07:22 PM