Share News

AP Assembly: ‘సార్.. మీతో అబద్దాలు చెప్పిస్తున్నారు’.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ

ABN , Publish Date - Feb 05 , 2024 | 11:07 AM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో పలు అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. అనేకసార్లు నినాదాలు చేశారు.

AP Assembly: ‘సార్.. మీతో అబద్దాలు చెప్పిస్తున్నారు’.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ

అమరావతి, ఫిబ్రవరి 5: ఏపీ అసెంబ్లీలో (AP Assembly Session) గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు (TDP MLAs) పదే పదే అడ్డుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో పలు అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. అనేకసార్లు నినాదాలు చేశారు. ‘‘సార్.. మీతో అబద్దాలు చెప్పిస్తున్నారు’’ అంటూ నిరసనకు దిగారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడా అంటూ తెలుగుదేశం సభ్యులు ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సిడీ రైతులకు కాదని... వైసీపీ నేతలకు ఇచ్చారని ఆరోపించారు. అయితే టీడీపీ సభ్యుల నినాదాలు మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎక్కడ అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీలకు జీతాలు ఎక్కడ అని.. జీతాలు పెంచకుండా అన్యాయం చేశారంటూ టీడీపీ సభ్యులు పెద్దగా కేకలు వేస్తూ నిరసన చేపట్టారు.

గవర్నర్ చేత ఇలా...

జగన్ ప్రభుత్వ పథకాలను గవర్నర్ చేత ప్రభుత్వం వల్లెవేయించింది. ఆరోగ్య శ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని.. 62 శాతం మంది వ్యవసాయం, అనుభంద రంగాలపై ఆధారపడి ఉన్నారని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. రైతుభరోసా పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు సాయం చేస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధర అందిస్తున్నామని గవర్నర్ అనడంతో రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏపీని ఆక్వాహబ్‌‌గా తయారు చేశామని గవర్నర్ చెప్పుకొచ్చారు. తెలుగు దేశం సభ్యుల ఆందోళనల నడుమే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 05 , 2024 | 11:24 AM