Share News

CM Jagan: ‘మేమంత సిద్దం’ బస్సు యాత్ర.. రేపటి నుంచి షురూ

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:22 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత ప్రచారం కోసం సీఎం, వైసీపీ అధినేేత జగన్ (CM Jagan) సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. రెండో విడత ‘మేమంతా సిద్ధం’ పేరుతో రేపటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. రేపు(బుధవారం) ఇడుపులపాయ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.

CM Jagan: ‘మేమంత సిద్దం’ బస్సు యాత్ర.. రేపటి నుంచి షురూ

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత ప్రచారం కోసం సీఎం, వైసీపీ అధినేేత జగన్ (CM Jagan) సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. రెండో విడత ‘మేమంతా సిద్ధం’ పేరుతో రేపటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. రేపు(బుధవారం) ఇడుపులపాయ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు ఇడుపులపాయలోని వైఎస్సాఆర్ ఘాట్‌కు సీఎం జగన్ చేరుకోనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించి మధ్యాహ్నం 1.30 గంటలకి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో పాల్గొననున్నారు.

ఈ యాత్రలో భాగంగా ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం),, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా జగన్ బస్సు యాత్రలో భాగంగా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వరకు బస్సు యాత్ర సాగనున్నది. ఎలాంటి గ్యాప్ లేకుండా 21 రోజులు పాటు ఇచ్చాపురం వరకు సీఎం జగన్ బస్సు యాత్ర సాగనున్నది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2024 | 10:29 PM