Share News

CM Jagan: ఓటు అడగనంటూనే ఓట్ల వేటకు బయలుదేరిన జగన్..

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:52 PM

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో తల్లి వైఎస్ విజయమ్మ...పలువురు ఎంపీలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. చాంతాడంత లిస్ట్ చెప్పి.. అవి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి ఫైనల్‌గా నేడు బస్సు యాత్ర పేరిట ఓట్ల వేటకు జగన్ బయలుదేరారు.

CM Jagan: ఓటు అడగనంటూనే ఓట్ల వేటకు బయలుదేరిన జగన్..

కడప: ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఘాట్ వద్ద నివాళులు సీఎం జగన్ (CM Jagan) అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma)...పలువురు ఎంపీలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. చాంతాడంత లిస్ట్ చెప్పి.. అవి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి ఫైనల్‌గా నేడు బస్సు యాత్ర పేరిట ఓట్ల వేటకు జగన్ బయలుదేరారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది.

AP Elections 2024: వాలంటీర్ల చేతుల్లో ప్రజల వ్యక్తిగత సమాచారం.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..?

గత ఎన్నికల (Elections)కు ముందు ప్రతిపక్ష నేతగా అనేక హమీలను సీఎం జగన్ ఇచ్చారు. వాటిని నెరవేర్చకపోతే ఈ ఎన్నికల్లో ఓటడగనని అప్పుడే చెప్పారు. సంపూర్ణ మధ్య పాన నిషేదం చేయకున్నా ఓటడగబోనని తెలిపారు. సీపీఎస్ (CPS) ను వారంరోజుల్లో రద్దు చేసి ఓపీఎస్ (OPS) ను పునరుద్ధరిస్తానని చెప్పి.. జీపీఎస్ ను తెచ్చి ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో జగన్ ఉంచారు. వైసీపీకి 25కు 25 ఎంపి సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతాం అన్నారు. రాజ్య సభ (Rajyasabha) సీట్లు కలుపుకుంటే అంతకు మించి ఇచ్చినా హోదా ఊసే లేదు. అధికారంలోకి వచ్చాక హోదా విషయంలో వినతి పత్రాలకు మాత్రమే జగన్ పరిమితమయ్యారు మినహా కేంద్రం మెడలు వంచిందీ లేదు.. హోదా అడిగిందీ లేదు.

Big Breaking: గ్రూప్ 1 పరీక్షలపై విచారణ వాయిదా..

కాళ్లు, గెడ్డాలు పట్టుకోని హోదా కోసం బతిమాలగలం... తప్ప కేంద్రాన్ని ఎదిరించలేం అంటూ జగన్ చేతులెత్తేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం అప్పట్లో టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని పదే పదే ప్రశ్నలు అడిగారు. ఇప్పడు హోదా అంశంపై జనానికి జగన్ ఏం చెపుతారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నేటికీ విశాఖ రైల్వే జోన్‌పై జగన్ నోరు మెదపిన పాపాన పోవడం లేదు. పోనీ అధికారంలోకి వచ్చాక ధరలను అలాగే ఉంచారా? అంటే అదీ లేదు. నిత్యావసరాల నుంచి విద్యుత్ చార్జీలు, బస్సు టికెట్ రేట్లను అనేక సార్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. పెరుగుతున్న నిత్యవసరాల ధరలను స్ధిరీకరిస్తామని ఆఖరుకు జగన్ చేతులెత్తేశారు. పైగా మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పారు. అది జరగకపోగా.. జే బ్రాండ్‌ల పేరిట సొంతంగా మద్యా్న్ని తయారు చేసి మరీ జనాన్ని మత్తులో ముంచేశారు.

Nara Lokesh: అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 01:53 PM