Pension Distribution : నేడు పల్నాడు జిల్లాకు చంద్రబాబు
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:55 AM
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో మంగళవారం పింఛన్ల పంపిణీ...

యలమందలలో పింఛన్లు పంపిణీ
నరసరావుపేట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గోనున్నారు. బీసీ వర్గానికి చెందిన వుల్లంగుల ఏడుకొండలు, ఎస్సీ కాలనీలోని ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారు. గ్రామస్తులతో ముచ్చటిస్తారు. ఇందు కోసం వేదిక ఏర్పాటు చేశారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిఽధుల సమావేశంలో జిల్లా అభివృదిధపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.