CM Chandrababu : అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగు
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:18 AM
‘అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే ప్రభుత్వం మాది.
జాతీయ రైతు దినోత్సవాన సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే ప్రభుత్వం మాది. అందుకే రైతు కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా నిరంతరం కృషి చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతు బాంధవుడు, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జయంతి సందర్భంగా దేశం ‘కిసాన్ దివ్‌స’ను జరుపుకుంటున్న వేళ.. సోమవారం ఎక్స్‌లో రైతు సోదరులందరికీ ఆయన జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . కాగా, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఎక్స్‌లో స్పందిస్తూ... రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు.