CID: ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:16 PM
ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

అమరావతి: ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి కరడుగట్టిన మద్దతుదారుగా వాసుదేవరెడ్డి పని చేశారు.
వైసీపీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో జే-బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర. జే-బ్రాండ్ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
For more AP News and Telugu News