Chandrababu Naidu: చంద్రబాబు-పవన్ ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ.. అమిత్ షా, జేపీ నడ్డాతో ఏం తేలుతుందో?
ABN , Publish Date - Mar 07 , 2024 | 10:25 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హస్తిన పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (JP Nadda) కలిసి.. పొత్తుపై మాట్లాడనున్నారు. ఇప్పటికే అమిత్ షా నివాసానికి జేపీ నడ్డా చేరుకోగా.. మరికాసేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకోనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హస్తిన పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (JP Nadda) కలిసి.. పొత్తుపై మాట్లాడనున్నారు. ఇప్పటికే అమిత్ షా నివాసానికి జేపీ నడ్డా చేరుకోగా.. మరికాసేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే.. వీరి చర్చలు ఎలా సాగుతున్నాయన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చేస్తుందా? లేదా? అనేది చర్చించుకుంటున్నారు.
కాగా.. త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సీన్‌లోకి బీజేపీ కూడా రావడంతో కొన్ని సీట్లను పక్కన పెట్టడం జరిగింది. ఇంతవరకూ పొత్తు ఖరారు కాలేదు కానీ, ఈ అంశంపై చర్చలు విడతల వారీగా చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జరగబోయే చర్చల్లో ఈ అంశంపై దాదాపుగా క్లారిటీ రావొచ్చని అంటున్నారు. ఒకవేళ పొత్తు ఖరారు అయితే 3 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లు బీజేపీ ఇవ్వాలని టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబుకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ మాత్రం 5 ఎంపీ, 13 అసెంబ్లీ సీట్లు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చూస్తుంటే.. 2014 సీన్ ఈ ఎన్నికల్లోనూ రిపీట్ కానుందని జనసేన, టీడీపీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి