Share News

Chandrababu: జగన్ దుమ్ము దులిపిన చంద్రబాబు

ABN , Publish Date - Mar 31 , 2024 | 06:51 PM

ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Chandrababu: జగన్ దుమ్ము దులిపిన చంద్రబాబు

ఒంగోలు, మార్చి 31: ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (ChandraBabu naidu) ప్రకటించారు. ప్రజాగళం (prajagalam) యాత్రలో భాగంగా ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా? మీకు... నిందితుడిని పక్కన పెట్టుకుని వైయస్ జగన్ తిరుగుతున్నారని విమర్శించారు. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావంటూ వైయస్ జగన్‌పై ఈ సందర్బంగా మండిపడ్డారు.

మీ బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడన్నారు. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నలు సంధించారు. అందుకు ప్రతిగా ప్రజలు లేదు లేదంటూ సమాధానం ఇచ్చారు. మూడు పార్టీల నాయకులు కలిసి తొక్కుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పారు. పార్లమెంట్‌లో ముస్లిం బిల్లులు తీసుకు వస్తే.. జగన్ సపోర్ట్ చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. అబ్దుల్ సలాంని వేధించడంతో.. ఆ కుటుంబ సభ్యులంతా ఆత్మాహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఉర్ధుని రెండో భాషగా మార్చింది తానేన్నారు. అలాగే హైదరాబాద్, కర్నూలులో సైతం ఉర్ధు యూనివర్శిటీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ అయిదేళ్లలో మైనార్టీలకు ఒక్క పని అయినా చేశావా.. చెప్పాలంటూ మార్కాపురం వేదిక మీద నుంచి సీఎం వైయస్ జగన్‌కు సవాల్ విసిరారు.

ప్రజలు గెలవాలంటే.. కూటమి గెలవాలన్నారు. ఈ రోజు మనం రాతి యుగంలో ఉన్నామని చెప్పారు. తన ప్రయాణం స్వర్ణయుగమని.. తాను ఒక డ్రైవర్‌గా పని చేస్తానని తెలిపారు. తమ బస్సులో ఎక్కిన వాళ్లంతా సురక్షితంగా గమ్యం చేరతారని పేర్కొన్నారు. గతంలో తన పాలన... ప్రస్తుతం జగన్ పాలన చూశారని ప్రజలనుద్దేశించి అన్నారు. మనకి కావాల్సింది కులం, మతం, ప్రాంతం కాదన్నారు. మన కులమని ఓటస్తే కరెంట్ ఛార్జీలు పెంచకుండా మానేశాడా?... అలాగే మన మతం వాడని ఓటేస్తే లిక్కర్ రేట్ తగ్గించాడా?.. మన ప్రాంతం వాడని ఓటేస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాడా? అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు ప్రజలకు ప్రశ్నలు సంధించారు.

హైదరాబాద్‌ని తెలుగు జాతి కోసం తానే అభివృద్ధి చేశానన్నారు. హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు వేశారంటే.. తన పేరే చెబుతారని అన్నారు. జగన్‌ బటన్ నొక్కే కొద్ది ప్రజలకు కష్టాలు పెరుగుతాయని చెప్పారు. తాగు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ప్రజలను ఉద్దరిస్తుందా? అని ప్రశ్నించారు. రేపు ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలని ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు సూచించారు. ఒక బటన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, మరో బటన్ కందుల నారాయణ రెడ్డికి నొక్కండని ప్రజలకు చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఎంపీగా మాగుంటను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపు నిచ్చారు.

మాగుంటకి వైసీపీలో అన్యాయం జరిగిందని.. ఆయన్ని అగౌరవ పరిచి బయటకు వెళ్లేలా చేశారని గుర్తు చేశారు. ఆడ బిడ్డ నిధి కింద ప్రతీ నెలకు రూ.1500 ఇస్తామని.. అలాగే తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని.. ఇక ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని... రైతులకు 20 వేలు ఇస్తామన్నారు. అలాగే 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడంతోపాటు 20 లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామన్నారు. రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు.

తాను అధికారంలో ఉంటే పరిశ్రమలు వస్తాయని.. అదే వైయస్ జగన్ అధికారంలో వస్తే మాత్రం పరిశ్రమలు పారిపోతాయని చంద్రబాబు చమత్కరించారు. ప్రతీ నెల రూ. 4 వేల పింఛన్ ఇంటి వద్దనే ఇచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఖజానా ఖాళీ కావడంతో పింఛన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీంతో టీడీపీ అడ్డుపడుతుందని తనపై అబండాలు వేస్తున్నాడీ ముఖ్యమంత్రి అంటూ వైయస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే, తమ్ముడు, మామ, బావమర్థి అంతా నియోజక వర్గాన్ని పంచుకుని ఊడ్చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిందే తానని.. అందుకు కేంద్రం సైతం సిద్దంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

AP News: ఈ సీఎంను కొనసాగించడం అవసరమా?

‘పెన్షన్ ఆలస్యం.. ప్రభుత్వ కుట్ర’

Updated Date - Mar 31 , 2024 | 08:10 PM