Share News

Polavaram: పార్లమెంట్ సాక్షిగా.. పోలవరం నిర్మాణం పూర్తి గడువు ప్రకటించిన కేంద్రం

ABN , Publish Date - Feb 08 , 2024 | 09:22 PM

పోలవరం నిర్మాణం పూర్తి గడువు తేదీని కేంద్రం ప్రకటించింది. పదే పదే మారుతున్న గడుపు తేదీని మళ్లీ పొడిగించారు.

 Polavaram: పార్లమెంట్ సాక్షిగా.. పోలవరం నిర్మాణం పూర్తి గడువు ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ: పోలవరం నిర్మాణం పూర్తి గడువు తేదీని కేంద్రం ప్రకటించింది. పదే పదే మారుతున్న గడుపు తేదీని మళ్లీ పొడిగించారు. పోలవరం (Polavaram Project) తొలిదశ పనుల పూర్తికి గడువు తేదీని 2026 మార్చికి పొడిగించారు. తొలిదశ పనులల్లో భాగంగా 41.15 మీటర్ల కాంటూర్‌లోనే నీళ్లను డాం లో నింపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఏపీలో పెండింగ్ ప్రాజెక్ట్‌లపై లోకసభలో వైసీపీ ఎంపీ పి. బ్రహ్మానంద రెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఈ ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వరతుడు.. లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దీంతో 2026 మార్చి నాటికే పోలవరం తొలిదశ పనులు పూర్తవుతాయని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పినట్లైంది.

Updated Date - Feb 08 , 2024 | 09:48 PM