Share News

AP News: అలిపిరి వద్ద కారు దగ్ధం..

ABN , Publish Date - May 16 , 2024 | 11:08 AM

Andhrapradesh: తిరుపతిలోని అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని పక్కక నిలిపివేశారు. డ్రైవర్‌తో పాటు కారులో నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు.

AP News: అలిపిరి వద్ద కారు దగ్ధం..
Car caught fire

తిరుపతి, మే 16: తిరుపతిలోని (Tirupati) అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని పక్కక నిలిపివేశారు. వెంటనే డ్రైవర్‌తో పాటు కారులో నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు. ఆ తరువాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి...

TDP: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!

AP News: రెచ్చిపోతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 11:19 AM