Share News

Bhuma Akhila Priya: అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో కీలక అప్‌డేట్

ABN , Publish Date - May 23 , 2024 | 04:30 PM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసు నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Bhuma Akhila Priya: అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో కీలక అప్‌డేట్
Akhila Priyas bodyguard case update

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసు నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ షర్ఫుద్దీన్ తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.


నంద్యాల జిల్లా(Nandyal district) ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై ఇటివల హత్యాయత్నం జరిగింది. అఖిల ప్రియ ఇంటిముందు నిఖిల్ నిల్చుని ఉండగా కారులో వచ్చిన పలువురు అతన్ని ఢీకొట్టారు. తర్వాత ముగ్గురు వ్యక్తులు అతనిపై ఆయుధాలతో దాడి చేశారు. ఆ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న నిఖిల్ అఖిలప్రియ ఇంట్లోకి దూసుకెళ్లారు. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను నంద్యాల ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇది కూడా చదవండి:

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి లొంగిపోతారని అనుమానం..అప్రమత్తమైన పోలీసులు


Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.


For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 04:33 PM