Share News

Atchannaidu: అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?

ABN , Publish Date - Feb 03 , 2024 | 11:31 AM

Andhrapradesh: విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య ఉదంతంపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్ రెడ్డికి తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ద రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు.

Atchannaidu: అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?

అమరావతి, ఫిబ్రవరి 3 : విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య ఉదంతంపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్ రెడ్డికి (CM Jagan Reddy) తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ద రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గమన్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతి భద్రతలకు అద్దంపడుతోందన్నారు. మండల మేజిస్టేట్‌నే ఇంట్లోకి వెళ్లి హత్య చేశారంటే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి అని నిలదీశారు.

ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. వైసీపీ వచ్చాక రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం అమలవుతోందని వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే హోమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు హోంమంత్రి ఎవరో వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి తెలియదన్నారు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ చేపట్టి దోషుల్ని శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 03 , 2024 | 01:14 PM