Share News

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చూసేయండి..

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:08 AM

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. టర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను..

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చూసేయండి..
AP Inter Exam Results

అమరావతి, ఏప్రిల్ 12: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. టర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.

ఫస్ట్ ర్యాంక్ ఏ జిల్లానంటే..

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో గుంటూరు, థర్డ్ ప్లేస్‌లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి.

ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరవగా.. 3,10,875 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలు 67%. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78. ఒకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 38,483 మంది హాజరవగా.. 23,181 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ పరీక్షకు 32,339 మంది విద్యార్థులు హాజరవగా.. 23,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ పరీక్షల్లో బాలబాలికల వారీగా ఫలితాల వివరాలు..

ఇంటర్ ఫస్ట్ ఇయర్..

  • మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 2,26,240 మంది.

  • ఉత్తీర్ణత సాధించిన వారు 1,43,688 మంది.

  • ఉత్తీర్ణత శాతం 64%.

  • మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలికలు 2,35,033 మంది.

  • ఉత్తీర్ణత సాధించిన వారు 1,67,187 మంది.

  • ఉత్తీర్ణత శాతం 71%.

  • ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి.

ఇంటర్ సెకండ్ ఇయర్..

  • ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 1,88,849 మంది.

  • ఉత్తీర్ణత సాధించిన వారు 1,44,465 మంది

  • ఉత్తీర్ణత శాతం 75%.

  • ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలికలు 2,04,908 మంది

  • ఉత్తీర్ణత సాధించిన వారు 1,65,063 మంది

  • ఉత్తీర్ణత శాతం 81%

  • ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ బాలికలదే పైచేయి.

బాలికలదే పైచేయి..

ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈసారి ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారని ప్రకటించారు పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలకు ఈ ఫలితాల వల్ల ఫ్యూచర్ ప్రభావితం కాదన్నారు. తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలకు మద్దతుగా ఉండాలని సూచించారు. లైఫ్.. పరీక్ష కన్నా చాలా గొప్పదని పేర్కొన్నారాయన. ఫెయిల్ అని విద్యార్థులకు వెంటనే సప్లై ఉంటుందని, పిల్లలకు మరో అవకాశం ఉంటుందన్నారు. సప్లమెంటరీ, మెయిన్ ఎగ్జామ్స్‌కు ఎలాంటి తేడాలు ఉండవన్నారు. రెండు పరీక్షలకు తేడా ఎవ్వరూ చూపించరన్నారు.

ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు..

ఊహించని ఫలితాల కారణంగా విద్యార్థులు క్షణికావేశంలో ఏమైనా చేసుకునే అవకాశం ఉందని.. విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం వారికి మనోధైర్యం కల్పించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా విద్యార్థులు మానసిక ఆందోళనలో ఉన్నట్లు గమనిస్తే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించారు.

  • AP Telemanas - 14416(Toll Free)

  • Roshini Helpline - 8142020044, 8142020033

  • 1Life - 7893078930

  • NIMHANS - 080 46110007 (Toll Free)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 11:45 AM