Share News

AP Government : హైస్కూల్‌ ప్లస్‌ను జడ్పీ జూనియర్‌ కాలేజీలుగా మార్చండి

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:05 AM

జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను రద్దు చేసే క్రమంలో వాటిని జిల్లా పరిషత్‌ జూనియర్‌ కళాశాలలుగా మార్చి ఇంటర్‌ విద్యను బలోపేతం చేయాలని..

 AP Government : హైస్కూల్‌ ప్లస్‌ను జడ్పీ జూనియర్‌ కాలేజీలుగా మార్చండి

టీచర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను రద్దు చేసే క్రమంలో వాటిని జిల్లా పరిషత్‌ జూనియర్‌ కళాశాలలుగా మార్చి ఇంటర్‌ విద్యను బలోపేతం చేయాలని ఏపీ హైస్కూల్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైస్కూల్‌ ప్లస్‌ వ్యవస్థను రద్దు చేస్తే గ్రామీణ బడుగు బలహీనవర్గాల బాలికలు డ్రాప్‌అవుట్స్‌గా మారి విద్యకు దూరమవుతారని తెలిపారు. హైస్కూల్‌ ప్లస్‌ పేరును జిల్లా పరిషత్‌ జూనియర్‌ కళాశాలలుగా మార్పు చేయాలని కోరారు.

Updated Date - Dec 29 , 2024 | 05:05 AM