Share News

AP News: జగన్ హయాంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా?

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:43 PM

ఈ ఆపద్దర్మ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హయాంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం అయితే తమకు లేదని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

AP News: జగన్ హయాంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా?

విజయవాడ, మార్చి 24: ఈ ఆపద్దర్మ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హయాంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం అయితే తమకు లేదని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం విజయవాడలో సుబ్బరాయన్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షనర్లను ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీనీ గద్దించాలని నిర్ణయించామన్నారు.

బిల్స్ పెడితే ఇన్‌కమ్ టాక్స్ కట్ చేశారే తప్ప బిల్లులు మాత్రం వేయలేదంటూ మండిపడ్డారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని ఆయన స్పష్టమైన హామీ సైతం ఇచ్చారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో.. ఎన్డీయే కూటమికే తమ మద్దతు అని.. ఆ కూటమి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా పెన్షనర్లకు ఆ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పిలుపు నిచ్చారు. ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకులందరూ మనకున్న ఓటు హక్కుతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని పిలుపు నిచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ గంజాయి రాష్ట్రంగా పేరు సంపాదించిందని గుర్తు చేశారు. రూ. 50 వేల కోట్ల విలువైన మత్తు పదార్థాలు రాష్ట్రానికి దిగుమతి చేశారని ఆరోపించారు. యువత భవిష్యత్తు నాశనం చేసేందుకు ఈ వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 05:43 PM