Old students : ఎంతగొప్ప కలయికనో..!
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:45 AM
పదో తరగతి దాటితే.. ఎవరి దావ వారిదే..! మళ్లీ కలుసుకునేందుకు ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. వెతికి పట్టుకునేందుకు ఇప్పటిలాగా సెల్‌ఫోనలు, సామాజిక మాధ్యమాలు లేవు. అలాంటిది ఏకంగా 56 ఏళ్ల క్రితం పదో తరగతి (ఎస్‌ఎ్‌సఎల్‌సీ) చదివినవారు కలుసుకోవడం అంటే మాటలా..? యల్లనూరు మండలం తిమ్మంపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1968-69 బ్యాచ ఎస్‌ఎ్‌సఎల్‌సీ విద్యార్థుల ...

పదో తరగతి దాటితే.. ఎవరి దావ వారిదే..! మళ్లీ కలుసుకునేందుకు ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. వెతికి పట్టుకునేందుకు ఇప్పటిలాగా సెల్‌ఫోనలు, సామాజిక మాధ్యమాలు లేవు. అలాంటిది ఏకంగా 56 ఏళ్ల క్రితం పదో తరగతి (ఎస్‌ఎ్‌సఎల్‌సీ) చదివినవారు కలుసుకోవడం అంటే మాటలా..? యల్లనూరు మండలం తిమ్మంపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1968-69 బ్యాచ ఎస్‌ఎ్‌సఎల్‌సీ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. వీరిలో వివిధ ఉద్యోగాలు చేసి రిటైరైనవారు
ఉన్నారు. వ్యవసాయం, ఇతర వృత్తులు చేస్తూ.. స్వస్థలాలో స్థిరపడినవారు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వీరందరూ బడిలో చదివిన రోజులను గుర్తు చేసుకుని.. మళ్లీ అక్కడే కలిశారు. జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పాఠశాలలో ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు. - యల్లనూరు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....