Share News

RECORD SUNSHINE : తాడిపత్రి.. 46 డిగ్రీల సెల్సియస్‌

ABN , Publish Date - May 04 , 2024 | 12:37 AM

జిల్లాలో రికార్డుస్థాయిలో ఎండలు నమోదువుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. మే నెలలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని రేకులకుంట ఆచార్య ఎన్జీరంగా వ్యవసార పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి హెచ్చరించారు. వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మే నెలలో గత 20 ...

RECORD SUNSHINE : తాడిపత్రి.. 46  డిగ్రీల సెల్సియస్‌

నిప్పుల కొలిమి.. జిల్లా

బుక్కరాయసముద్రం, మే 3: జిల్లాలో రికార్డుస్థాయిలో ఎండలు నమోదువుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. మే నెలలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని రేకులకుంట ఆచార్య ఎన్జీరంగా వ్యవసార పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి హెచ్చరించారు. వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మే నెలలో గత 20 సంవత్సరాలలో లేనంతగా.. తాడిపత్రిలో శుక్రవారం 46 డిగ్రీల సెల్సియస్‌


ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీలు నమోదు కావాలి. కానీ 5-6 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదువుతున్నాయి. ఉదయం 8 గంటల దాటితే... భానుడు భగభగమంటున్నాడు. జిల్లాలో శుక్రవారం శింగనమలలో 45.9, పుట్లూరు 45.6, నార్పల 44.7, గుంతకల్లు 44.7, యల్లనూరు 44.4, విడపనకల్లు, అనంతపురం 44, పెద్దవడుగూరు 43.9, యాడికి 43.9, డి.హీరేహళ్‌ 43.7, బుక్కరాయసముద్రం 43.5, గార్లదిన్నె 43.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 04 , 2024 | 12:47 AM