Share News

Bhuvaneshwari: చిన్నారికి నామకరణం చేసిన నారా భువనేశ్వరి

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:02 PM

Andhrapradesh: హిందూపురం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.

Bhuvaneshwari: చిన్నారికి నామకరణం చేసిన నారా భువనేశ్వరి

హిందూపురం, ఫిబ్రవరి 15: హిందూపురం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూపురంలో పర్యటిస్తున్న భువనేశ్వరి... ఓ చిన్నారికి నామకరణం చేశారు. సింగనమల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త హేమంత్ యాదవ్, శోభాయాదవ్ దంపతులకు మగ పిల్లాడు జన్మించాడు. హిందూపురంలో నిజం గెలవాలి కార్యక్రమం వద్దకు హేమంత్ యాదవ్ దంపతులు తమ బిడ్డతో వచ్చారు. తమ బిడ్డకు నామకరణం చేయాలని హేమంత్ యాదవ్ దంపతులు కోరారు. దీంతో ‘కుశల్ కృష్ణ’ అంటూ చిన్నారికి భువనేశ్వరి నామకరణం చేశారు. తమ బిడ్డకు భువనేశ్వరి నామకరణం చేయడం పట్ల హేమంత్ యాదవ్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 15 , 2024 | 12:02 PM