PLANT : నాటితే సరిపోతుందా..?
ABN , Publish Date - May 07 , 2024 | 12:43 AM
రుద్రంపేట సర్కిల్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకూ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో ..
రుద్రంపేట సర్కిల్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకూ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో
కొన్నింటినైనా పెంచాల్సిన బాధ్యత లేదా..? మొక్కలు నాటే సమయంలో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం.. పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడం.. ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టుకుంటే సరిపోతుందా..? స్వచ్ఛంద సంస్థలకో, విద్యాసంస్థల్లో ఎనఎ్‌సఎ్‌స వలంటీర్లకు మొక్కలు పెంచే బాధ్యతను అప్పగించినా వాటిని కాపాడుకుంటారు కదా..! చిత్తశుద్ధి లేకుంటే ఎలా..? పర్యావరణంపై దాడి చేయడానికి ముందుండే యంత్రాంగం.. సమతుల్యతను కాపాడటంలోనూ అంతే ముందుండాలి కదా..?
- అనంతపురం రూరల్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....