Share News

HEALTH : టీబీ మందులు నిండుకున్నాయ్‌..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:36 AM

వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందుబాటులో లేకపోయినా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇవ్వాల్సిన మాత్రలను.. బయట అమ్ముతున్నారు. ‘అక్కడికి వెళ్లి కొనండి’ అని వైద్యులు రాసిస్తున్నారు. జిల్లాలో క్షయ వ్యాధి బాధితులు మందులను బయటే కొంటున్నారు. ‘ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ఆశయం. ఇంటి వద్దకే వైద్యులను పంపుతాం. మెరుగైన చికిత్స చేయిస్తాం. క్షయ అంతం.. ప్రభుత్వ పంతం’ అంటూ వైద్యశాఖ అధికారులు సైతం ఊదరగొడుతుంటారు.

HEALTH : టీబీ మందులు నిండుకున్నాయ్‌..!

ఆరు నెలలుగా అరకొరగా సరఫరా

మార్కెట్‌లో కొంటున్న బాధితులు

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 23: వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందుబాటులో లేకపోయినా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇవ్వాల్సిన మాత్రలను.. బయట అమ్ముతున్నారు. ‘అక్కడికి వెళ్లి కొనండి’ అని వైద్యులు రాసిస్తున్నారు. జిల్లాలో క్షయ వ్యాధి బాధితులు మందులను బయటే కొంటున్నారు. ‘ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ఆశయం. ఇంటి వద్దకే వైద్యులను పంపుతాం. మెరుగైన చికిత్స చేయిస్తాం. క్షయ అంతం.. ప్రభుత్వ పంతం’ అంటూ వైద్యశాఖ అధికారులు సైతం ఊదరగొడుతుంటారు.


టీబీకి మందులు ఉచితంగా ఇస్తామని, కోర్సు పూర్తిగా వాడాలని చెబుతుంటారు. కానీ చేతల్లో చూపడం లేదు. జిల్లాలోని చాలా సెంటర్లకు టీబీ మందులు కొన్ని నెలలుగా సరఫరా కావడం లేదు. ఈ వ్యాధి బాధితులు క్రమం తప్పుకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందులను మార్కెట్‌లో అమ్మకుండా ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. కానీ ఇవేవీ సరిగా అమలు కావడం లేదు.

3,976 మంది బాధితులు

జిల్లా వైద్యశాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 3,976 మంది టీబీ బాధితులు ఉన్నారు. వీరిలో అనంతపుం జిల్లాలో 2,392 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 1,584 మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వమే చికిత్స చేయిస్తోంది. 19 టీబీ యూనిట్స్‌, 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందిస్తోంది. వ్యాధి తీవ్రతను బట్టి మందుల కోర్సు వాడాల్సి ఉంటుంది. డాక్టర్లు చెబుతున్న మేరకు డ్రగ్స్‌ సెన్సిటివ్‌ (డీఎ్‌సటీబీ) టీబీ అయితే ప్రతి రోజు యాంటీ టీబీ మాత్రలు రెండు పూటల వేసుకోవాల్సి ఉంటుంది. అదే సెన్సిటివ్‌ డ్రగ్స్‌ టీబీ అయితే 9 నెలల నుంచి 24 నెలల వరకు యాంటీ టీబీ మాత్రలు రెండు పూటలా తీసుకావాల్సి ఉంటుంది. మందులను సక్రమంగా వాడకపోతే వ్యాధి తీవ్రత అలాగే ఉంటుంది. పైగా ఇతర సమస్యలు తలెత్తుతాయని వైద్యవర్గాలే అంటున్నాయి. ఇంతటి కీలకమైన మాత్రలు గత ఆరునెలలుగా సక్రమంగా సరఫరా చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా ఈటీబీ పోగ్రామ్‌ కేంద్ర ప్రభుత్వానిదని, ఈ మందులు కేంద్రమే పంపిణీ చేయాల్సి ఉంటుందని సాకులు చెబుతున్నారు.


సమస్య లేకుండా చూస్తున్నాం...

టీబీ మందులు సకాలంలో సరఫరా కాకపోవడం నిజమే. అయినా బాధితులకు మందుల సమస్య లేకుండా చూస్తు న్నాం. ప్రైవేటులో కొని అందిస్తున్నాం. నాలుగు బాక్స్‌లలో 4 వేల సి్ట్రప్స్‌ వైజాగ్‌ నుంచి వస్తున్నాయి. ఒక్కొక్క షీట్‌లో నెలకు సరిపడా మాత్రలు ఉంటాయి. ఇప్పుడు కూడా మావద్దకు వస్తే మందులు ఇచ్చి పంపిస్తాం. జిల్లా కేంద్రంలో రెండు ప్రైవేటు మందుల షాపులలో ఈ మందులు ఇవ్వడానకి అనుమతి ఇచ్చాం. వారు మందులు తీసుకున్న వారి వివరాలు మాకు ఇవ్వాల్సి ఉంటుంది.

- డాక్టర్‌ అనుపమ జేమ్స్‌, జిల్లా క్షయనివారణ అధికారి

ఎప్పుడు బాగుపడుతుందో..!

అనంతపురం పెద్దాసుపత్రిలో రోగులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. వైద్యం, ఔషధాలు, సేవలు.. అన్నింటా వైఫల్యం కనిపిస్తోంది. అందుకు ఉదాహరణ.. ఈ ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం..! రాయదుర్గం మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన నాగమణికి కడుపునొప్పి తీవ్రంగా వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం పెద్దాస్పత్రికి మంగళవారం తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ విభాగం డాక్టరు.. ఆల్రాసౌండు స్కానింగ్‌కు రాసిచ్చారు. ఎంఎనఓ ఆమెను సె్ట్రచ్చర్‌లో స్కానింగ్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. స్కానింగ్‌ పూర్తయ్యాక ఆమె బయటకు వచ్చి చూస్తే.. సె్ట్రచర్‌ కనిపించలేదు. కడుపునొప్పి ఏమాత్రం తగ్గకపోవడంతో ఆమె కింద పడుకుని పొర్లుతూ, విలవిలలాడింది. ఆమె భర్త సిద్ధేశ్వర సె్ట్రచ్చర్‌ కోసం తిరిగారు. పరిస్థితిని వివరించి..


వైద్యుల సాయం కోరారు. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దిక్కుతోచక భార్య వద్దకు వచ్చాడు. ఉక్కపోత, కడుపునొప్పితో అల్లాడిపోతున్న ఆమెకు తన బంధువుతో కలిసి తన టవల్‌తో ఊదుతూ సఫర్యలు చేశారు. అటుగా వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, రిపోర్టర్‌ గమనించి.. వివరాలు అడిగితే.. గోడు వెళ్లబోసుకున్నారు. రెండు గంటల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకువెళ్లింది. దీంతో ఆమె సిబ్బందిని పురమాయించి, నాగమణిని వార్డుకు తరలింపజేశారు.

- అనంతపురం టౌన

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 12:36 AM