Share News

POWER CUT : వేసవిలో విద్యుత సమస్యలు

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:30 AM

ఎండ వేడిమి, వడగాడ్పులతోనే ఇబ్బంది పడుతుంటే విద్యుత సమస్యలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వేసవి కాలం కావడంతో విద్యుత వినియోగం పెరిగింది. లోఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా ఇళ్లలో ఉన్నా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్యను అధిగమించేందుకు విద్యుత శాఖ చేపడుతున్న పనులు ప్రజలకు ఉపశమనం కలిగించలేకపోతున్నాయి. దీంతో ప్రజలు విద్యుత శాఖపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు కానీ సమస్యలు తీర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

POWER CUT : వేసవిలో విద్యుత సమస్యలు
Meter burning at transformer in Papampeta due to overload

లో ఓల్టేజీతో వినియోగదారుల సతమతం

ట్రాన్సఫార్మర్ల సామర్థ్యానికి మించి కనెక్షన్లు

వినియోగం పెరిగిపోవడంతో ఇబ్బందులు

ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు

అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌ 23: ఎండ వేడిమి, వడగాడ్పులతోనే ఇబ్బంది పడుతుంటే విద్యుత సమస్యలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వేసవి కాలం కావడంతో విద్యుత వినియోగం పెరిగింది. లోఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా ఇళ్లలో ఉన్నా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్యను అధిగమించేందుకు విద్యుత శాఖ చేపడుతున్న పనులు ప్రజలకు ఉపశమనం కలిగించలేకపోతున్నాయి.


దీంతో ప్రజలు విద్యుత శాఖపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు కానీ సమస్యలు తీర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన విద్యుత వినియోగం

ప్రస్తుత వేసవిలో ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు వారి ఉష్ణోగ్రతలు 42డిగ్రీల నుంచి 45డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 10గంటలు దాటితే ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. సాయంత్రం 6గంటలు వరకు సూరిడు చుర్రుమనిపిస్తున్నాడు. దీంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈక్రమంలో విద్యుత వినియోగం భారీగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 12లక్షల గృహకనెక్షన్లు ఉన్నాయి. రోజువారిగా విద్యుత వినియోగం 19మిలియన యూనిట్ల నుంచి 21మిలియన యూనిట్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో విద్యుత పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా లో ఓల్టేజీ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.


సామర్థ్యానికి మించి కనెక్షన్లు..

ఉమ్మడి జిల్లాలో గృహాలకు సంబంధించి 500కేవీఏ ట్రాన్సఫార్మర్లు ఎనిమిది, 315కేవీఏ-70, 250కేవీఏ-43, 200కేవీఏ తొమ్మిది, 160కేవీఏ-962, 100కేవీఏ-6132, 75కేవీఏ-82, 63కేవీఏ -3253, 50కేవీఏ-169, 40కేవీఏ-61, 25కేవీఏ -321 త్రీఫేజ్‌ ట్రాన్సఫార్మర్లు ఉన్నాయి. అలాగే సింగిల్‌ ఫేజ్‌ లో 25కేవీఏ-1280, 16కేవీఏ- 2804, 15కేవీఏ- 8911, 10కేవీఏ- 4954 చొప్పున ట్రాన్సఫార్మర్లు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. మొత్తంగా 30వేల ట్రాన్సఫార్మర్లు గృహాలకు సంబంధించి ఉన్నట్లు విద్యుత అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయి తే ఈ కనెక్షన్లకు సరిపడా ట్రాన్స ఫార్మర్లు క్షేత్రస్థాయిలో లేకపోవడంతో విద్యుత సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదనలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ప్రస్తుత్తం ఏ ఇంట్లో చూచిన 1కేవీఏకీ పైగానే విద్యుత వాడకం ఉంటోంది. ఈకారణంగానే 2కేవీఏకు పునరుద్ధరణ పేరుతో విద్యుత అధికారులు రూ.1500లకుపైగానే వినియోగదారుల నుంచి ఇటీవల కట్టించుకున్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో 25ట్రాన్సఫార్మర్‌కు 25కు మించి గృహకనెక్షన్లు ఉండకూడదు. క్షేత్రస్థాయిలో మాత్రం 60 నుంచి 100 కనెక్షన్లు ఉంటున్నాయి. ఈక్రమంలో లో ఓల్టేజీ, విద్యుత వైర్లు కాలి తెగిపోవడం, ట్రాన్సఫార్మర్లు పేలడం, ఇతరత్ర సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే లోఓల్టేజీ, హైఓల్టేజీ సమస్యలతో ఇళ్లలోని ఎలకి్ట్రక్‌ వస్తువులు దెబ్బతింటున్నాయి. విద్యుత కనెక్షన్లకు అనుగుణంగా ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేస్తే కొంత వరకు సమస్యను అధిగమించవచ్చు. ఆమేరకు విద్యుత అధికారులు చొరవ చూపాల్సి ఉంది. అనంతపురం టౌన పరిధిలోని కొన్ని సబ్‌స్టేషన్లలో ట్రాన్సఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో కొంత మేరకు విద్యుత సమస్యలు తగ్గినట్లు తెలుస్తోంది. మరి కొన్ని ప్రాంతాల్లో సమస్య అలాగే ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 12:30 AM