Share News

Raghuveera: ఏం చేశావని అనంతకు వస్తున్నావు?.. జగన్‌కు రఘువీరా సూటి ప్రశ్న

ABN , Publish Date - Feb 17 , 2024 | 02:44 PM

Andhrapradesh: సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఏం చేశారని వస్తున్నారని ప్రశ్నించారు.

Raghuveera: ఏం చేశావని అనంతకు వస్తున్నావు?.. జగన్‌కు రఘువీరా సూటి ప్రశ్న

శ్రీ సత్యసాయి జిల్లా, ఫిబ్రవరి 17: సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి (CWC Member Raghuveera Reddy) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఏం చేశారని వస్తున్నారని ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో హంద్రీనీవా పూర్తి చేస్తానన్నావు... ఒక్క అంగుళం పనులు కూడా చేయలేకపోయావు. కరువు రైతును కాపాడడం కోసం తీసుకువచ్చిన ప్రాజెక్ట్ అనంత ఏమైంది?... కేంద్ర ప్రభుత్వం రూ.7860 కోట్లు మంజూరు చేసినా కార్యరూపం దాల్చలేదు. రాయదుర్గం ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏమైంది.. కార్యరూపం దాల్చేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మంత్రి పెద్దిరెడ్డి పొడిచి చంపే ప్రయత్నం చేశాడు’’ అంటూ రఘువీరా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2024 | 02:44 PM