Share News

AP News 30 మంది ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరెవరిని ఎక్కడెక్కడకంటే..

ABN , Publish Date - Jan 30 , 2024 | 07:23 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. తాము చెప్పినట్లు ఎవరు వింటారో అలాంటి వారిని ఎంపిక చేసి మరీ కీలక స్థానాల్లో నియమించింది. ముఖ్యంగా దళిత అధికారుల్ని ఎన్నికల్లో పావులుగా వాడుకునే తెలివి ప్రదర్శించింది.

AP News 30 మంది ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరెవరిని ఎక్కడెక్కడకంటే..

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. తాము చెప్పినట్లు ఎవరు వింటారో అలాంటి వారిని ఎంపిక చేసి మరీ కీలక స్థానాల్లో నియమించింది. ముఖ్యంగా దళిత అధికారుల్ని ఎన్నికల్లో పావులుగా వాడుకునే తెలివి ప్రదర్శించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఏకపక్షంగా వ్యవహరించే ఎస్పీ రిశాంత్‌ రెడ్డిని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌(ఉగ్రవాదుల ఏరివేత)కు బదిలీ చేసిన ప్రభుత్వం.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక విభాగం ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అంటే తమకు పూర్తిగా అనుకూలమైన ఐపీఎస్‌ అఽధికారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వదిలి పోకుండా కాపాడుకుంది. మరోవైపు చిత్తూరు ఎస్పీగా కృష్ణా జిల్లా ఎస్పీ పి. జాషువాను నియమించింది. వైసీపీ నేతలకు వంగి దండాలు పెడుతూ తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనంలో అధికార పార్టీ నేతల్ని బహిరంగంగా తిప్పే అధికారిగా ఈయనకు ‘మంచి’ పేరుంది. గతంలో అదే జిల్లాలో డీఎస్పీగా పనిచేసిన జాషువా వైసీపీ నేతలకు వీరవిధేయుడిగా పేరుగడించారు.

ఏ ఏ అధికారిని ఎక్కడెక్కడకు మార్చిందంటే..

రైల్వే పోలీస్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌

ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్‌ సింగ్‌

ఆక్టోపస్‌ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌

రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఐజీగానూ శ్రీకాంత్‌కు అదనపు బాధ్యతలు

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి

డ్రగ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కొల్లి రఘురామిరెడ్డికి అదనపు బాధ్యతలు

రాష్ట్రస్థాయి పోలీసు నియామకబోర్డు ఛైర్మన్‌గా రాజశేఖర్‌బాబు

ఐజీ హోంగార్డ్స్‌గానూ రాజశేఖర్‌బాబుకు అదనపు బాధ్యతలు

సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి

పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ

టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీగా హరికృష్ణకు అదనపు బాధ్యతలు

స్పోర్ట్స్‌ ఐజీగా కె.వి.మోహన్‌రావు

ఆక్టోపస్‌ డీఐజీగా సెంథిల్‌ కుమార్‌

శాంతిభద్రతల డీఐజీగాను సెంథిల్‌కు అదనపు బాధ్యతలు

పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్‌దేవ్‌ శర్మ

విశాఖ రేంజ్‌ డీఐజీగా విశాల్‌ గున్ని

కర్నూలు రేంజ్‌ డీఐజీగా సీహెచ్‌ విజయరావు

విశాఖ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా ఫకీరప్ప

కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్‌ నయీం ఆస్మి

ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌

ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీగా ఆరిఫ్‌ హఫీజ్‌

ప.గో. జిల్లా ఎస్పీగా హజిత వేజెండ్ల

రాజమండ్రి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గా సుబ్బారెడ్డి

కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా వై.రిశాంత్‌ రెడ్డి

ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగాను రిశాంత్‌రెడ్డిగా అదనపు బాధ్యతలు

చిత్తూరు ఎస్పీగా జోషువా

ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్‌

విశాఖ శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్‌ మణికంఠ

ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌గా అధిరాజ్‌ సింగ్‌ రాణా

కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా కృష్ణకాంత్‌ పటేల్‌

గుంటూరు ఎస్పీగా తుషార్‌

జగ్గయ్యపేట డీసీపీగా కె.శ్రీనివాసరావు

రంపచోడవరం ఏఎస్పీగా కె.ధీరజ్

పాడేరు ఏఎస్పీగా ఎ.జగదీశ్‌

విజయవాడ డీసీపీగా ఆనంద్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 30 , 2024 | 07:23 AM