Viveka Case : చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డి

ABN , First Publish Date - 2023-09-22T12:25:41+05:30 IST

వివేకా కేసులో అరెస్ట్ అయిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 12 రోజుల పాటు భాస్కర్‌రెడ్డి కి ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. భాస్కర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్‌గూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇచ్చారు.

Viveka Case : చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డి

హైదరాబాద్ : వివేకా కేసులో అరెస్ట్ అయిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 12 రోజుల పాటు భాస్కర్‌రెడ్డి కి ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. భాస్కర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్‌గూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇచ్చారు. మెడికల్ ట్రీట్‌మెంట్ దృష్ట్యా భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోనే చికిత్స పొందాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 3 న చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ ముందు సరెండర్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. జైలు నుంచి విడుదలైన వెంటనే భాస్కర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు.

Updated Date - 2023-09-22T12:25:41+05:30 IST