ప్రేయసితో కలిసి హోటల్‌కి వెళ్లిన ప్రియుడు.. యువతి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే..
ABN , Publish Date - Dec 14 , 2023 | 06:22 PM
ప్రేయసితో కలిసి హోటల్‌కి వెళ్లిన ప్రియుడు.. గది నుంచి బయటికి వెల్లిన కొద్ది సేపటికి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన...
హైదరాబాద్: ప్రేయసితో కలిసి హోటల్‌కి వెళ్లిన ప్రియుడు.. గది నుంచి బయటికి వెల్లిన కొద్ది సేపటికి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని బేగంబజార్ పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. 19 సంవత్సరాల ఓ యువకుడు తన ప్రేయసితో కలిసి బుధవారం రాత్రి బేగంబజార్‌లోని ఓ లాడ్జికి వెళ్లాడు. అయితే కొన్ని గంటల తర్వాత గది నుంచి యువతి బయటికి వెళ్లిపోయింది. తర్వాత కొద్ది సేపటికే యవకుడు బాత్రూంలో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ యువకుడు గతంలోనూ రెండు సార్లు తన ప్రేయసితో కలిసి హోటల్‌కి వచ్చినట్లు విచారణలో తెలిసింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి ఆత్మహత్య వెనుక గల కారణాలపై విచారణ చేస్తున్నారు.